Vistara flight: విస్తారా విమానానికి బాంబు బెదిరింపు; టర్కీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్-bomb threat forced vistara flight to make an emergency landing in turkey ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vistara Flight: విస్తారా విమానానికి బాంబు బెదిరింపు; టర్కీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Vistara flight: విస్తారా విమానానికి బాంబు బెదిరింపు; టర్కీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Sudarshan V HT Telugu
Sep 07, 2024 04:23 PM IST

విస్తారా ఎయిర్ లైన్స్ విమానం యూకే 27 కు బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని టర్కీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే, ఆ తరువాత విస్తృత తనిఖీల అనంతరం విమానానికి ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించారు. భద్రతా తనిఖీల అనంతరం విమాన సర్వీసులు యథావిధిగా ప్రారంభమయ్యాయి.

విస్తారా విమానానికి బాంబు బెదిరింపు; టర్కీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
విస్తారా విమానానికి బాంబు బెదిరింపు; టర్కీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (AP)

ముంబై నుంచి ఫ్రాంక్ ఫర్ట్ వెళ్తున్న భారత్ కు చెందిన విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానాన్ని బాంబు బెదిరింపు కారణంగా తూర్పు టర్కీలోని ఎర్జురమ్ నగరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలోని ఒక టాయలెట్ లో ‘విమానంలో బాంబు ఉంది’ అని రాసి ఉన్న ఒక నోట్ ను సిబ్బంది గుర్తించారు. దాంతో, ఆ విమానాన్ని అత్యవసరంగా తూర్పు టర్కీలోని ఎర్జురమ్ నగరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం, ప్రయాణికులు, సిబ్బందిని బయటకు తీసుకువచ్చారు. ఆ తరువాత, బాంబ్ స్క్వాడ్ విమానాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశారు.

ఉత్తుత్తి బెదిరింపు

ముంబై నుంచి ఫ్రాంక్ ఫర్ట్ వెళ్తున్న విస్తారా ఎయిర్ లైన్స్ యూకే27 విమానంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఎర్జురమ్ లో విమానం ల్యాండ్ అయింది. ఆ తరువాత కొన్ని గంటల పాటు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ‘‘రాత్రి 11:30 గంటల సమయానికి అన్ని సెర్చ్ అండ్ ఎగ్జామినేషన్ ఆపరేషన్లు పూర్తయ్యాయి. బాంబు బెదిరింపు నిరాధారమైనదని నిర్ధారించాము’’ అని ఎర్జురమ్ గవర్నర్ ముస్తఫా సిఫ్ట్సి విమానాశ్రయంలో విలేకరులతో చెప్పారు. తమ ప్రావిన్స్ నుంచి వచ్చే లేదా బయలుదేరే అన్ని విమానాలు ఇకపై సౌకర్యవంతంగా ప్రయాణించగలవని ఆయన చెప్పారు.

ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానం

ప్రత్యామ్నాయ విమానం 12.25 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) టర్కీ విమానాశ్రయానికి చేరుకుందని, 14.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రయాణికులందరితో ఫ్రాంక్ ఫర్ట్ కు బయలుదేరిందని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. తనిఖీలు పూర్తయిన తర్వాత విమానాశ్రయంలో ల్యాండింగ్, టేకాఫ్ లపై విధించిన ఆంక్షలను ఎత్తివేసినట్లు సీఐఎఫ్సీఐ తెలిపింది. కస్టమర్లు, సిబ్బంది, విమానాలను భద్రతా సంస్థలు క్లియర్ చేశాయని, అవసరమైన అన్ని తనిఖీలు నిర్వహించామని విస్తారా (vistara) ఎక్స్ లో ఒక పోస్ట్ లో తెలిపింది. ప్రయాణికులను ఫ్రాంక్ ఫర్ట్ కు తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయ విమానాన్ని టర్కీకి పంపినట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది.

Whats_app_banner