Bengaluru news: వైరల్ గా మారిన బెంగళూరులోని ట్రాఫిక్ సైన్ బోర్డు; క్రియేటివిటీకి హ్యాట్సాఫ్..
Bengaluru viral news: బెంగళూరులో ఒక రోడ్డు పక్కగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సైన్ బోర్డ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుతూ, అత్యంత సృజనాత్మకంగా రూపొందించిన ఈ సైన్ బోర్డ్ పై నెటిజన్లు ప్రశంసలు గురిపిస్తూ, పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
Bengaluru traffic signboard: బెంగళూరులోని కబ్బన్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ ట్రాఫిక్ సైన్ బోర్డు రోడ్డు భద్రతపై సందేశం ఇచ్చిన తీరు వైరల్ గా మారింది. ఎక్స్ (ట్విటర్) లో షేర్ చేసిన ఈ సైన్ బోర్డుకు నెటిజన్ల నుంచి విపరీతమైన సానుకూల స్పందన లభిస్తోంది. వారు పెద్ద ఎత్తున పాజిటివ్ కామెంట్లతో రియాక్ట్ అవుతున్నారు. అయితే, కొందరు మాత్రం ఈ ఆలోచనను తప్పుపడుతున్నారు.
ఆ ట్రాఫిక్ సైన్ బోర్డ్ లో ఏముంది?
ఆ ట్రాఫిక్ సైన్ బోర్డులో రెండు వేర్వేరు ఫాంట్ సైజుల్లో పదాలు రాశారు. ట్రాఫిక్ లైట్స్ లోని రెడ్, యెల్లో, గ్రీన్ లైట్స్ ను హైలైట్ చేస్తూ, ఈ సైన్ బోర్డ్ లో కామెంట్ రాశారు. ఆ కామెంట్ ఇలా ఉంటుంది. ‘‘ఫాలో ట్రాఫిక్ రూల్స్.. సమ్ వన్ ఈజ్ వెయింటింగ్ ఫర్ యూ.. ఎట్ హోం’’ అనే వ్యాక్యాన్ని ట్రాఫిక్ లైట్స్ లోని రెడ్, యెల్లో, గ్రీన్ లైట్స్ ను హైలైట్ చేస్తూ.. రెండు వేర్వేరు ఫాంట్ సైజుల్లో ముద్రించారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటించాల్సిన అవసరాన్ని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చాలా క్రియేటివ్ గా చూపించారని ఆ చిత్రాన్ని చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చిత్రాన్ని పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు.
నెటిజన్ల స్పందన..
బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పై ఎమోషనల్ టచ్ తో అవగాహన కల్పిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం రెండు వేర్వేరు ఫాంట్స్ ఉండడం వల్ల చిన్న ఫాంట్ ను వాహనదారులు చదవలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. ఇది డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవర్ ఏకాగ్రతను దెబ్బ తీస్తుందని వివరిస్తున్నారు.
ఫాల్ సమ్ వన్ హోం..
మొదట ఈ సైన్ బోర్డ్ (Bengaluru traffic signboard) ను చూడగానే.. పెద్ద సైజ్ ఫాంట్ లో ఉన్న ‘‘ఫాలో సమ్ వన్ హోం’’ అనే పదాలు కన్పిస్తాయి. ‘‘ఎవరినైనా ఇంటివరకు ఫాలో కండి’’ అనే అర్థం వచ్చే ఈ మెసేజ్ కొంత ఫన్నీగా ఉంటుంది. అయితే, చిన్న సైజ్ ఫాంట్ లో ఉన్న పదాలను కూడా చదివితే, పూర్తి సందేశం అర్థం అవుతుంది. ఇది చాలా క్రియేటివ్ గా ఉందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
లైక్స్, షేర్స్, కామెంట్స్
ఫిబ్రవరి 25 న షేర్ చేసినప్పటి నుండి, ఎక్స్ పోస్ట్ కు దాదాపు 13,000 లైకులు మరియు అనేక కామెంట్లు వచ్చాయి. చాలా మంది ఎక్స్ వినియోగదారులు ఈ సైన్ బోర్డుపై తమ ప్రతిస్పందనను పంచుకున్నారు. దీనిపై కొందరు జోకులు పేల్చగా, మరికొందరు తమ అయిష్టతను పంచుకున్నారు. "మీమ్ వర్తీ మెటీరియల్" అని ఒక ఇందువియల్ ప్రతిస్పందించాడు. దీనికి రావు స్పందిస్తూ.. 'విసుగు చెందిన డ్రైవర్లను ఎంటర్ టైన్ చేయడానికే ఇది' అని బదులిచ్చారు.
గతంలో కూడా..
బెంగళూరులో ఒక క్రియేటివ్ సైన్ బోర్డు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బెంగళూరులోని విలాసవంతమైన కోరమంగళ పరిసరాల్లో ఏర్పాటు చేసిన 'నో పార్కింగ్' బోర్డులు కూడా వైరల్ అయ్యాయి. "నో పార్కింగ్" అనే సాధారణ సందేశానికి బదులుగా, “ఇక్కడ పార్కింగ్ గురించి కూడా ఆలోచించవద్దు”, ‘‘నో పార్కింగ్... 10 నిమిషాలు కాదు, 5 నిమిషాలు కాదు, అస్సలు కాదు’’ అని ఆ సైన్ బోర్డ్ లో పేర్కొన్నారు.