Amazon Lay off: పది వేలు కాదు 18,000! అమెజాన్ భారీ నిర్ణయం-amazon to lay off over 18000 employees company ceo andy jassy reveals ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amazon Lay Off: పది వేలు కాదు 18,000! అమెజాన్ భారీ నిర్ణయం

Amazon Lay off: పది వేలు కాదు 18,000! అమెజాన్ భారీ నిర్ణయం

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 05, 2023 08:26 AM IST

Amazon to lay off 18000 Employees: అమెజాన్ భారీ నిర్ణయం తీసుకుంది. 18,000కుపైగా ఉద్యోగులను తీసేయనుంది. ముందుగా 10వేల మంది తొలగించాలని ప్లాన్ చేసుకోగా.. ఇప్పుడు ఆ సంఖ్యను 80శాతం పెంచింది. వివరాలివే..

Amazon Lay off: పది వేలు కాదు 18,000! అమెజాన్ భారీ నిర్ణయం
Amazon Lay off: పది వేలు కాదు 18,000! అమెజాన్ భారీ నిర్ణయం

Amazon to lay off 18000 Employees: 2023 కొత్త సంవత్సరంలోనూ లేఆఫ్స్ గండం పోయేలా లేదు. 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించింది. 10వేల మందిని తీసేయాలని నిర్ణయించుకున్నట్టు గతంలో ప్రకటించిన ఆ కంపెనీ.. ఆ ప్లాన్‍ను మరింత తీవ్రంగా చేసింది. ఆ సంఖ్యలో 80 శాతం పెంచింది. మొత్తంగా 18వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని అమెజాన్ సీఈవో యాండీ జాసీ (Andy Jassy) ప్రకటించారు. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెసేజ్ పంపారు. దీన్ని ట్విట్టర్‌లోనూ అమెజాన్ షేర్ చేసింది. ఎకానమీలో అనిశ్చితి వల్ల 18వేల మంది ఎంప్లాయిస్‍ను లేఆఫ్ చేయనున్నట్టు అమెజాన్ వెల్లడించింది.

కార్పొరేట్ ర్యాంక్ ఉద్యోగులను కూడా..

10వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని గతేడాది అమెజాన్ ప్రకటించింది. అయితే ప్లాన్ చేసిన దాని కంటే 80శాతం ఎక్కువ మందిని అంటే 18,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేయాలని తాజాగా నిర్ణయించుకుంది. కార్పొరేట్ ర్యాంక్ ఉద్యోగులు కూడా ఇందులో ఉంటారని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ వెల్లడించింది. ఇది పూర్తయితే, అమెజాన్ చరిత్రలో ఒకేసారి ఇంతమంది ఉద్యోగులను లేఆఫ్ చేయడం ఇదే మొదటిసారి కానుంది.

కారణాలివే..

ప్రపంచాన్ని.. ముఖ్యంగా అమెరికాను ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఆర్థిక వృద్ది అంతంత మాత్రంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా ఇప్పట్లో నియంత్రణలోకి రాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో వినియోగదారుల కొనుగోళ్లు తగ్గుతాయని అమెజాన్ భావిస్తోంది. ప్రజలు తక్కువగా ఖర్చు పెడతారని అనుకుంటోంది. అమ్మకాలు పడిపోయి.. ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తోంది. దీంతో ముందు ప్లాన్ చేసుకున్న దాని కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తీసేసేందుకు మొగ్గు చూపుతోంది.

ఫేస్‍బుక్ పేరెంట్ కంపెనీ మెటా కూడా గతేడాది భారీగా ఉద్యోగులను తొలగించింది. ఒకేసారి 11వేల మందిని తీసేసింది. కంపెనీ ఆదాయం తగ్గడం, అవసరాల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారన్న కారణాలతో ఈ చర్యలు చేపట్టింది. ఇక ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ కూడా కంపెనీలో సగానికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపేశారు. 3,700 మందికి పైగా ఎంప్లాయిస్‍ను తొలగించారు. ఇక చాలా భారీ సంస్థలు కూడా సిబ్బందిని తగ్గించుకున్నాయి. 2023లో మాంద్యం ఎక్కువగా ఉంటుందని ఐఎంఎఫ్ కూడా అంచనా వేస్తుండటంతో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని నిపుణులు చెబుతున్నారు.

Whats_app_banner

టాపిక్