మూడేళ్లల్లో రూ. 1లక్షను .. రూ. 61లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​..!-adani green shares turns rs 1 lakh to rs 61 lakh in 3 years ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మూడేళ్లల్లో రూ. 1లక్షను .. రూ. 61లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​..!

మూడేళ్లల్లో రూ. 1లక్షను .. రూ. 61లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​..!

HT Telugu Desk HT Telugu
May 21, 2022 10:10 AM IST

స్టాక్​ మార్కెట్​లోని మల్టీబ్యాగర్​ స్టాక్స్​లో అదానీ గ్రీన్​ ఎనర్జీ స్టాక్​ ఒకటి. ఈ స్టాక్​.. మూడేళ్లల్లో అద్భుత రిటర్నులు ఇచ్చింది. రూ. లక్షను ఏకంగా రూ. 61లక్షలుగా మార్చేసింది.

<p>మల్టీబ్యాగర్​ స్టాక్​.. మూడేళ్లలలో 61 రెట్లు పెరిగిన షేరు విలువ</p>
మల్టీబ్యాగర్​ స్టాక్​.. మూడేళ్లలలో 61 రెట్లు పెరిగిన షేరు విలువ (HT Telugu)

Adani green energy share news | గత కొంతకాలంగా.. అదానీ స్టాక్స్​ వార్తల్లో నిలుస్తున్నాయి. మల్టీబ్యాగర్​ స్టాక్స్​లో అదానీ సంస్థలకు చెందిన షేర్లు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిలో ఆదానీ గ్రీన్​ ఎనర్జీ స్టాక్​ ఒకటి. ఈ స్టాక్​.. మూడేళ్ల కాలంలో రూ. 37.40 నుంచి ఏకంగా రూ. 2,279కు పెరిగింది. అంటే మూడేళ్ల క్రితం పెట్టుబడి పెట్టిన మదుపర్లకు ఏకంగా 6000శాతం రిటర్నులు తెచ్చిపెట్టింది ఈ మల్టీబ్యాగర్​ అదానీ గ్రీన్​ ఎనర్జీ స్టాక్​.

ఈ అదానీ గ్రీన్​ ఎనర్జీ స్టాక్​.. నెల రోజులుగా కన్సాలిడేషన్​ మోడ్​లో ఉంది. నెల రోజుల వ్యవధిలో రూ. 2,280 నుంచి రూ. 2,279కు దిగొచ్చింది. కానీ 2022 నుంచి పోల్చుకుంటే.. ఇప్పటివరకు మంచి రిటర్నులే ఇచ్చింది. జనవరిలో రూ. 1347గా ఉన్న అదానీ గ్రీన్​ ఎనర్జీ స్టాక్​.. ప్రస్తుతం రూ. 2279 వద్ద ఉంది. అంటే 70శాతం పెరిగినట్టు. ఇక ఏడాది కాలంతో పోల్చుకుంటే.. 75శాతం రిటర్నులు ఇచ్చింది.

2019 మే 17న.. ఈ మల్టీబ్యాగర్​ స్టాక్​.. రూ. 37.40 వద్ద ఉండేది. అంటే మూడేళ్లల్లో ఈ స్టాక సంపదన 61రెట్లు పెరిగినట్టు!

రూ. 1లక్షతో.. రూ. 61లక్షలు..!

నెల ముందు.. అదానీ గ్రీన్​ ఎనర్జీ స్టాక్​లో రూ. 1లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 80వేలుగా ఉండేది. అదే 2022 తొలినాళ్లల్లో రూ. లక్ష పెడితే.. ఇప్పుడది రూ. 1.70లక్షలు అయ్యేది. ఏడాది క్రితం.. ఈ మల్టీబ్యాగర్​ స్టాక్​లో రూ. 1 లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడది రూ. 1.75లక్షలుగా అయ్యేది.

Multibgger stock news | అదే మూడేళ్ల క్రితం.. అంటే.. అదానీ గ్రీన్​ ఎనర్జీ స్టాక్​ రూ. 37.40గా ఉన్నప్పుడు.. రూ. లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడది ఏకంగా రూ. 61లక్షలు అయ్యేది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి.. అదానీ గ్రీన్​ ఎనర్జీ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 3,60,153కు చేరింది. ప్రస్తుతం అదానీ గ్రీన్​ ఎనర్జ బుక్​ వాల్యూ.. షేరుకు 16.62గా ఉంది.

మల్టీబ్యాగర్​ స్టాక్స్​ను గుర్తించడం ఎలా?

మల్టీబ్యాగర్​ స్టాక్​.. ఈ పేరు వింటే చాలు.. ఇన్​వెస్టర్లకు, ట్రేడర్లకు ఎక్కడ లేని జోష్​ వచ్చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే మల్టీబ్యాగర్​ స్టాక్స్​ కూడా తక్కువ సమయంలోనే అధిక లాభాలను తెచ్చిపెడతాయి. అలాంటి మల్టీబ్యాగర్​ స్టాక్స్​లో పెట్టుబడులు పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు! ముఖ్యంగా కొత్తగా మార్కెట్​లోకి వచ్చినవారు.. మల్టీబ్యాగర్​ స్టాక్స్​ను పసిగట్టేందుకు చాలా కష్టపడుతూ ఉంటారు. సోషల్​ మీడియా, టీవీ న్యూస్​ ఛానెళ్లల్లో చెప్పినా.. మనం పెట్టుబడులు పెట్టేసరికి.. వాటి పరుగు నెమ్మదించిపోతుంది. ఒక్కోసారి అక్కడి నుంచి కిందపడిపోతూ ఉంటాయి. మరి ఓ స్టాక్​కు​.. మల్టీబ్యాగర్​ గుర్తింపు రాకముందే ఎలా పసిగట్టొచ్చు? తద్వారా మంచి లాభాలను ఎలా ఆర్జించవచ్చు? అన్నవి ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ స్టాక్​.. మల్టీబ్యాగర్​గా మారేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు ఐఆర్​సీటీసీ.. ఓ మల్టీబ్యాగర్​ స్టాక్​. మార్కెట్​లో ఐఆర్​సీటీసీకి గుత్తాధిపత్యం ఉండటమే ఇందుకు కారణం. ఇదే విధంగా.. మరికొన్ని కీలక విషయాలు ఉన్నాయి. అవేంటంటే..

ఆర్​ఓసీఈ

Multibagger stocks India | ఆర్​ఓసీఈ అంటే.. రిటర్న్​ ఆన్​ క్యాపిటల్​ ఎంప్లాయిడ్​. సింపుల్​గా చెప్పాలంటే.. సంస్థలో పెట్టిన మూలధనానికి ఎంత రిటర్న్​ వస్తోంది? అనే విషయాన్ని లెక్కించడం. ఆర్​ఓసీఈ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది.

ఓ కంపెనీ.. ఎప్పటికప్పుడు ఆదాయాన్ని పెంచుకుంటూపోతుంటే.. అది మంచి విషయమే. అయితే.. ఆర్​ఓసీఈ తగ్గకుండా.. ఎప్పటికప్పుడు ఆదాయం పెంచుకుంటున్న కంపెనీల షేర్లు.. మల్టీబ్యాగర్​లుగా మారే అవకాశం ఉంది.

క్యాష్​ ఫ్లో

కంపెనీ కార్యకలాపాలను సాగించేందుకు నిధులను ఎంత మేర పంపిస్తున్నామో చెప్పేదే క్యాష్​ ఫ్లో. భవిష్యత్తులో.. కంపెనీకి ఆదాయం పెరుగుతుందా? లేదా? అన్నది ఈ క్యాష్​ ఫ్లో స్టేట్​మెంట్లు చెబుతాయి. మాటిమాటికి కంపెనీలోకి క్యాష్​ ఫ్లో అవుతూ ఉంటే.. కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయం.. కంపెనీ ఖర్చులకు సరిపోవడం లేదని అర్థం. అదే జరిగితే.. ఆ కంపెనీ తరచూ అప్పులు చేస్తూ ఉండాలి. లేకపోతే ఈక్వీటీనైనా అమ్ముకోవాల్సి ఉంటుంది.

మల్టీబ్యాగర్​ కంపెనీలు.. లాభాలతో పాటు ఆపరేటింగ్​ క్యాష్​ఫ్లోలను కాంపౌండింగ్​ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. తద్వారా.. భవిష్యత్తులో ఇతర సంస్థల కన్నా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం వీటికి ఉంటుంది.

అయితే.. ఇక్కడ ఒక సమస్య ఉంది. కంపెనీ క్యాష్​ ఫ్లోలు, ఆదాయాలు ఎక్కువగానే ఉన్నా.. కొన్నిసార్లు అభివృద్ధి పరంగా అవి నెమ్మదిస్తూ ఉంటాయి(ఉదా- కొత్త కస్టమర్లను ఆకట్టుకోలేకపోతే..). వాటిల్లో పెట్టుబడులకు మంచి రిటర్నులు రాకపోవచ్చు.

నిధుల కేటాయింపులు..

Multibaggar stocks meaning | మల్టీబ్యాగర్​ కంపెనీలకు అంచనాలకు మించిన ఫ్రీ క్యాష్​ ఉంటుంది. అంటే మంచి ఆదాయాలు వస్తుంటాయి. ఆర్​ఓసీఈ చాలా బాగా ఉంటుంది. అదే సమయంలో క్యాష్​ ఫ్లోలు కూడా సంస్థ అభివృద్ధికి తగ్గట్టుగానే ఉంటాయి. కానీ ఇలా ఉన్న కంపెనీలన్నీ మల్టీబ్యాగర్​లు కాలేవు. దానికి ముఖ్యకారణం.. నిధుల కేటాయింపు.

నిధుల కేటాయింపుతోనే మంచి కంపెనీకి.. మల్టీబ్యాగర్​ కంపెనీకి మధ్య ఉన్న వ్యత్యాసం తెలిసిపోతుంది. నిధులను సక్రమంగా వినియోగించి మరింత ఆదాయాన్ని జెనరేట్​ చేయగలిగే సంస్థలకు మల్టీబ్యాగర్​లుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కొన్ని కంపెనీలు.. పెట్టుబడుల్లో తీసుకునే తప్పుడు నిర్ణయాల కారణంగా డీలా పడుతూ ఉంటాయి. తద్వారా.. మిగిలినవి అన్నీ సరిగ్గా ఉన్నా.. మల్టీబ్యాగర్​ గుర్తింపు తెచ్చుకోలేకపోతాయి.

కంపెనీల పర్ఫార్మెన్స్​లను పరిశీలించేందుకు వివిధ వెబ్​సైట్​లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఎప్పటికప్పుడు చెక్​ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రాసిన ఆర్టికల్​ మాత్రమే. ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు.. మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్​ను సంప్రదించడం ఉత్తమం.

Whats_app_banner