దారుణం.. 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!-87yearold woman raped in delhi s tilak nagar police starts investigation ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  దారుణం.. 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!

దారుణం.. 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!

HT Telugu Desk HT Telugu
Feb 14, 2022 04:14 PM IST

Delhi crime news | 87ఏళ్ల వృద్ధురాలు.. అత్యాచారానికి గురైన సంఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించింది. తిలక్​నగర్​లో నివాసముంటున్న ఆమెపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాలపడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి తన తల్లిని అత్యాచారం చేసినట్టు.. ఆమె కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

<p>దారుణం.. 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!</p>
దారుణం.. 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం! (hindustan times)

Tilak Nagar rape incident | దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 87ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఎవరూ లేని సమయంలో..

తిలక్​ నగర్​లో ఓ 87ఏళ్ల వృద్ధురాలు.. తన 65ఏళ్ల కుమార్తెతో నివాసముంటోంది. ఆదివారం మధ్యాహ్నం పని మీద కుమార్తె బయటకు వెళ్లింది.

ఇంతలో ఓ వ్యక్తి.. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు అక్కడే ఉండి, ఆ తర్వాత వెళ్లిపోయాడు.

కొంతసేపటికి కుమార్తె తిరిగి ఇంటికి వచ్చింది. చిరిగిపోయిన దుస్తుల్లో తల్లి ఉండటం చూసి షాక్​ అయ్యింది. ఇంట్లో కొన్ని వస్తువులు అదృశ్యమయ్యాయని గమనించింది. ఎవరో వచ్చి దొంగతనం చేశారని భావించి.. పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది. మొబైల్​ ఫోన్​ పోయిందని ఫిర్యాదులో పేర్కొంది. స్పందించిన పోలీసులు.. సంబంధిత సెక్షన్లతో ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

ఆ 65ఏళ్ల మహిళ.. సోమవారం మళ్లీ పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది. తన 87ఏళ్ల తల్లిపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎఫ్​ఐఆర్​లో మరిన్ని సెక్షన్లు జోడించారు.

మరోవైపు బాధితురాలికి కౌన్సిలింగ్​ ఇస్తున్నారు. అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు.

ఉన్మాది ‘ప్రేమ’కు మహిళ బలి..

గుజరాత్​లోని సూరత్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ మహిళను గొంతుకోసి చంపేశాడు ఓ ఉన్మాది. అడ్డొచ్చిన మహిళ కుటుంబసభ్యులను గాయపరిచాడు. చివరికి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.

Surat crime news | ఫెనిల్ ​గోయాని, గ్రీష్మ వెకారియా(21)లు ఒకే స్కూల్​లో చదువుకున్నారు. తన ప్రేమను అంగీకరించాలని గ్రీష్మ వెంట ఎన్నోసార్లు తిరిగాడు గోయాని. అందుకు గ్రీష్మ ఒప్పుకోలేదు. ఆమె కుటుంబసభ్యులు సైతం గోయానిని అంగీకరించలేదు.

కామ్​రేజ్​ ప్రాంతంలో.. శనివారం సాయంత్రం 6గంటల సమయంలో.. గ్రీష్మ మేనమామ.. గోయానిని మందలించాడు. తమ బిడ్డ వెంటపడొద్దని తేల్చిచెప్పాడు. కానీ గోయాని వినలేదు. చేతిలో ఉన్న కత్తితో ఆతనిని పొడిచాడు. సోదరుడితో కలిసి తప్పించుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. కానీ గ్రీష్మను పట్టుకున్న ఆ ఉన్మాది.. చేతిలో ఉన్న కత్తితో.. ఆమె గొంతు కోసేశాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అంతటితో ఆగకుండా.. ఆ మహిళ సోదరుడిని సైతం గాయపరిచాడు. చివరికి గోయాని ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించాడు. కత్తితో తన చేతిని కోసుకున్నాడు. విషం తాగేందుకు యత్నించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లారు. గోయానిని అరెస్ట్​ చేసి ఆసుపత్రికి తరలించారు.

Whats_app_banner

సంబంధిత కథనం