Elon Musk | 10 సెకన్లు చాలు.. పుతిన్‌ను ఓడించడానికి!
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను తనతో ఫైట్‌కు రమ్మని సవాలు విసిరిన ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్.. తాజాగా మరో రెండు ట్వీట్లు చేశాడు. ఆయన ట్వీట్లతో ట్విటర్ హోరెత్తుతోంది.
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై దాడికి తెగబడి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ప్రపంచమంతా గుర్రుగా ఉంది. ఆయనకు చాలా మంది శాపనార్థాలు పెడుతున్నారు. అయితే ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ మాత్రం ఓ అడుగు ముందుకేసి.. దమ్ముంటే నాతో ఫైట్‌కు రా అంటూ పుతిన్‌కు సవాలు విసిరారు.
సోమవారం మస్క్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. ట్విటర్‌లో మస్క్ పేరు ట్రెండింగ్‌లో ఉంది. అసలు ఆయన సీరియస్‌గానే ఈ మాట అన్నారా అని ట్విటర్ ఓ వైపు చర్చిస్తుంటే.. మస్క్ మరో రెండు ట్వీట్లతో మరింత ఆశ్చర్యపరిచారు.
నిజంగా పుతిన్, మస్క్ తలపడితే.. పది సెకన్లలో ఆ ఫైట్ ముగుస్తుంది. పుతిన్‌కు ఎంత నష్ట కలిగించాలనుకుంటున్నారు? ఎంత సేపట్లో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. పైగా మస్క్.. పుతిన్ కంటే 19 ఏళ్లు చిన్నవాడు అంటూ ఓ ట్విటర్ యూజర్ వాళ్ల హైట్‌లను బేరీజు వేస్తూ ఓ ట్వీట్ చేశాడు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. కరెక్టే ఆ 10 సెకన్లు చాలు అన్నట్లుగా ప్రెట్టీ మచ్ అంటూ రిప్లై ఇచ్చాడు.
పుతిన్‌తో నిజంగానే ఫైట్‌కు సిద్ధంగా ఉన్నారా అని మరో యూజర్ అడిగిన ప్రశ్నకు కూడా మస్క్ స్పందించారు. నేను చాలా సీరియస్‌గా ఉన్నాను అని మస్క్ రిప్లై ఇవ్వడం విశేషం. నిజానికి సరదా ట్వీట్లతో నెటిజన్లు ఆకర్షించడం మస్క్‌కు అలవాటు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలోనూ పుతిన్.. నీకు దమ్ముంటే నాతో ఫైట్‌కు రా అని మస్క్ ట్వీట్ చేస్తే.. ఇది కూడా అలాంటి సరదా ట్వీటే అని చాలా మంది అనుకున్నారు కానీ.. ఈ విషయంలో నిజంగానే మస్క్ సీరియస్‌గా ఉన్నారని తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఉక్రెయిన్ పట్ల ఇప్పటికే మస్క్ సానుభూతితో ఉన్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ దేశం అడిగిన వెంటనే వాళ్లకు తన సంస్థ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను కూడా అందించారు.
సంబంధిత కథనం
టాపిక్