Women Hygiene : ఆ భాగాన్ని శుభ్రం చేసేందుకు రోజూ లిక్విడ్ వాష్ ఉపయోగిస్తున్నారా?-women hygiene is it safe to use intimate wash products every day all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Women Hygiene Is It Safe To Use Intimate Wash Products Every Day All You Need To Know

Women Hygiene : ఆ భాగాన్ని శుభ్రం చేసేందుకు రోజూ లిక్విడ్ వాష్ ఉపయోగిస్తున్నారా?

HT Telugu Desk HT Telugu
May 26, 2023 02:49 PM IST

Women Hygiene : శరీరం పరిశుభ్రంగా ఉండేందుకు జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది నిపుణులు దీని గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఇతర శరీర భాగాల పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలకు ముఖ్యమైన యోని భాగాన్ని కూడా చాలా పరిశుభ్రంగా చూసుకోవాలి.

మహిళల పరిశుభ్రత
మహిళల పరిశుభ్రత (unsplash)

యోని శుభ్రత కోసం, యోని వాష్‌లు(vaginal wash products), ఇంటిమేట్ వాష్‌లను ఉపయోగించడం సర్వసాధారణం. అయితే యోనిని శుభ్రం చేయడానికి ప్రతిరోజూ ఈ వాష్ లిక్విడ్ లేదా క్రీమ్ ఉపయోగించడం ఎంతవరకు మంచిది? మహిళలు తమ యోనిని శుభ్రం చేయడానికి కొన్ని ఉత్పత్తులను ఉపయోగించడం గురించి నిపుణులు ఏమంటారో చూద్దాం.

యోని వాష్, ఇంటిమేట్ వాష్ అని పిలిచే కొన్ని ఉత్పత్తులు స్త్రీల బాహ్య జననేంద్రియాలను శుభ్రం చేయడానికి తయారుచేస్తారు. యోనిని శుభ్రంగా ఉంచడానికి, ఇన్ఫెక్షన్‌(Infections)ను నివారించడానికి, దుర్వాసనను నివారించడానికి, సహజమైన pH సమతుల్యతను ఆమ్ల లక్షణాలతో నిర్వహించడానికి ఇంటిమేట్ వాష్ రూపొందించారు. దీనిని ఎక్కువగా మహిళలు ఉపయోగిస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం యోని శుభ్రత ముఖ్యమే.., కానీ ప్రతిరోజూ ఇంటిమేట్ వాష్ ఉపయోగించి యోనిని శుభ్రం చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కొన్ని మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతాయి, అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.

రోజూ తలస్నానం చేసేటపుడు సబ్బు లేదా నీళ్లతో చేస్తాం, అలాంటప్పుడు ప్రతిరోజూ వెజినల్ క్లీనింగ్(Vaginal Cleaning) ఎందుకు ఉపయోగించకూడదు అనే ప్రశ్న రావచ్చు.. ఇలా వాష్‌లను యోనిలో ఉపయోగించడం వల్ల క్రమంగా సహజ సమతుల్యతలో సమస్య ఏర్పడుతుంది. ఇది కొన్ని చర్మ అలెర్జీల(Skin Allergy) వంటి సమస్యను కలిగిస్తుంది. యోని పరిశుభ్రత ఉత్పత్తులను ఉపయోగించడానికి నిర్దిష్ట వయస్సు లేదు, మహిళలు, బాలికలు అందరూ వాటిని ఉపయోగించవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన పొందిన తర్వాత ఈ ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది.

ఫెమినైన్ వాష్ లేదా వెజినల్ వాష్(vaginal wash) ను రోజూ వాడటం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. యోనిలో దురద, పొడిబారడం, అలర్జీ వంటివి వచ్చే అవకాశం ఉంది. వెజినల్ వాష్‌లో పెర్ఫ్యూమ్‌లు వాడతారు కాబట్టి కఠినమైన రసాయనాలు వాడే అవకాశం ఉంది.

స్త్రీలు తమ యోని లేదా జననేంద్రియాలను ఇంటిమేట్ వాష్‌లు, యోని వాష్‌లను ఉపయోగించడం ద్వారా మాత్రమే కాకుండా శుభ్రంగా ఉంచుకోవచ్చు. కొన్ని సహజ ప్రక్రియలను అభ్యసించడం ద్వారా శుభ్రం చేసుకోవచ్చు.

మనం ప్రతిరోజూ శరీరం వెలుపల శుభ్రంగా ఉంచుకున్నట్లే, జననేంద్రియ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజూ గోరువెచ్చని నీరు, pH సమతుల్యత లేదా సువాసన లేని సబ్బుతో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల ఆ భాగంలో ఇరిటేషన్, ఇన్ఫెక్షన్, అలర్జీ మొదలైన వాటిని నివారించవచ్చు.

వీలైనంత శుభ్రంగా ఉండే కాటన్ లోదుస్తులను ధరించడం అలవాటు చేసుకోండి. అలాగే లోదుస్తులు త్వరగా తడిసిపోతే తేమ లేకుండా మార్చుకోవాలి. యోని ప్రాంతం తేమగా ఉంటే, ఈస్ట్ లేదా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.

భాగస్వామితో సంభోగం చేయడం సాధారణమైనప్పటికీ, ఈ సమయంలో మీరు మీ యోని ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. సెక్స్ తర్వాత(After Sex) పరిశుభ్రత పాటించకపోతే, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని ఎదుర్కొంటారు.

శరీరంలోని అనేక సమస్యలకు సరైన ఆహారం ముఖ్యమైన పరిష్కారం. మంచి పోషకమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి(Immunity) కూడా పెరుగుతుంది. శరీరం నిర్జలీకరణం చెందకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సరైన ఆహారం(Food) తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్‌లను నివారించవచ్చు.

యోని వాసన లేదా దుర్వాసనను వదిలించుకోవడానికి పెర్ఫ్యూమ్ ఉత్పత్తులను కొంతమంది ఉపయోగిస్తారు. అయితే ఇది ఎన్ని అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. యోని ప్రాంతంలో స్ప్రేలు లేదా లిక్విడ్‌లను ఉపయోగించడం మానుకోండి. అధిక సువాసన కలిగిన ఉత్పత్తులలో కూడా ఎక్కువ రసాయనాలు ఉన్నాయని తెలుసుకోండి. వాటికి దూరంగా ఉంటే, అలెర్జీ చికాకు వంటి సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం