Domestic Violence on Nawazuddin: కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనీయడం లేదు.. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌పై భార్య ఫిర్యాదు-nawazuddin siddiqui wife aaliya complaint against her husband ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Domestic Violence On Nawazuddin: కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనీయడం లేదు.. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌పై భార్య ఫిర్యాదు

Domestic Violence on Nawazuddin: కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనీయడం లేదు.. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌పై భార్య ఫిర్యాదు

Maragani Govardhan HT Telugu
Feb 02, 2023 03:27 PM IST

Domestic Violence on Nawazuddin: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై అతడి భార్య ఆలియా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భోజనం పెట్టడం లేదని, కనీసం వాష్ రూమ్‌కు కూడా వెళ్లనీయడం లేదని తన అడ్వకెట్ ద్వారా పిటీషన్‌ను దాఖలు పరిచారు.

భార్యతో నవాజుద్దీన్
భార్యతో నవాజుద్దీన్

Domestic Violence on Nawazuddin: బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆయన భార్య ఆలియా సిద్ధిఖీ సంచలన ఆరోపణలు చేశారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్న పరిస్థితుల్లో విడాకులకు సిద్ధమవుతున్నారు. అయితే ఆలోపే ఇద్దరి మధ్య విభేధాలు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. తన భర్త నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆయన కుటుంబం తనను తీవ్రంగా వేధిస్తున్నారని, గృహహింసకు గురి చేస్తున్నారని ఆలియా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆస్తి వివాదం కారణంగా గత వారం నవాజుద్దీన్ తల్లి తనపై కేసు పెట్టిందని ఆలియా ఆరోపించారు. పాస్‌పోర్టు సమస్యల కారణంగా దుబాయ్ నుంచి తిరిగొచ్చి నవాజ్ ఉంటున్న అంధేరి హౌస్‌లో తాను ఉంటున్నానని, ఇంట్లో తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు తన అడ్వకేట్ ద్వారా పిటిషన్ దరఖాస్తు చేశారు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతడి కుటుంబ సభ్యులు నా క్లయింట్ ఆలియా సిద్ధిఖీని ఇంటి నుంచి పంపించేయడానికి చేయాల్సిన ప్రతి పని చేస్తున్నారు. వారు ఆమెపై అక్రమాస్తుల నేరారోపణలను దాఖలు చేశారు. ఆ తర్వాత పోలీసులు ద్వారా వారు ఆమెను అరెస్టు చేస్తామని బెదిరించారు. ప్రతి రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు పిలుస్తున్నారు. గత ఏడు రోజులుగా నా క్లయింట్‌కు ఆహారం కూడా ఇవ్వలేదు. కనీసం నిద్రపోడానికి మంచం, స్నానానికి వాష్‌రూమ్‌కు కూడా వెళ్ల నీయడం లేదు. వారు నా క్లయింట్ చుట్టూ బాడీ గార్డ్స్‌ను ఉంచారు. ఆమె ఉన్న హాల్‌లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ప్రస్తుతం పిల్లలతో నా క్లయింట్ అక్కడే ఉంటున్నారు. అని ఆలియా తరఫు న్యాయవాది పిటీషన్‌లో పేర్కొన్నారు.

తన పిల్లలను చూడటానికి కూడా నవాజ్ రావట్లేదని ఆలియా ఆరోపించారు. పిల్లలకు తమ విడాకుల గురించి చెప్పలేదని, నాన్న ఎక్కడకెళ్లారని ప్రశ్నిస్తే.. షూట్‌లో ఉన్నారని అబద్ధం చెబుతున్నానని తెలిపారు. కానీ ఇలా ఎన్ని రోజులు చెబుతాను? తన పిల్లలను చూసేందుకైనా రావాలని ఆమె స్పష్టం చేశారు.

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ 2009లో ఆలియాను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి కుమార్తే షోరా, కుమారుడు యాని సిద్ధిఖీ ఉన్నారు. 2021లో ఆలియా.. నవాజుద్దీన్‌కు విడాకుల నోటీసులు పంపించారు. తమ 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. నవాజ్ కుటుంబం తనపై గృహహింసకు పాల్పడ్డారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అందుకే తాను విడిపోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో విచారణ జరుగుతోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్