Sunday Motivation : కలిసి ఉండేవాళ్లంతా.. ప్రేమలో ఉన్నారని భ్రమ పడకండి..-sunday motivation on so many people are in love and not together and so many people are together and not in love ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sunday Motivation On So Many People Are In Love And Not Together And So Many People Are Together And Not In Love

Sunday Motivation : కలిసి ఉండేవాళ్లంతా.. ప్రేమలో ఉన్నారని భ్రమ పడకండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 11, 2022 06:15 AM IST

Sunday Motivation : మనం నమ్మి తీరాల్సిన నిజం ఏమిటంటే.. మనలో చాలా మంది ప్రేమలో ఉండే ఉంటారు. కానీ వాళ్లు కలిసి ఉండలేరు. అలాగే కలిసి ఉన్నవాళ్లంతా ప్రేమతో ఉంటున్నారు అనుకుంటే అది మన పొరపాటే. కాబట్టి జీవితంలో ఏది ఉన్నా లేకున్నా.. మీకు మీరే సాటి అనుకుంటూ.. మనకి లేదు పోటి అనుకుంటూ బతికేయండి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : అబ్బా.. ఆ జంట ఎంత క్యూట్​గా ఉన్నారో.. వాళ్లు ఎంత బాగా ప్రేమించుకుంటున్నారో.. మనకి అలాంటి పార్టనర్​ దొరికితే బాగుంటుంది కదా అని.. ఏ జంటనైనా చూసి మీరు బాధపడుతున్నారా? అయితే మీ ఎక్స్​ప్రెస్​ ఆలోచనలకు ఓ బ్రేక్ వేయండి. ఎందుకంటే.. మనం చూస్తున్న ప్రేమికులంతా జీవితాంతం కలిసి ఉంటారని చెప్పలేము. వాళ్లకి మధ్యలోనే బ్రేకప్ అయిపోవచ్చు. లేదంటే వారి మధ్యనే మనస్పర్థలు రావొచ్చు. ఒకవేళ వాళ్లు కలిసే ఉంటున్నా.. వారి మధ్య ప్రేమ లేకపోవచ్చు. పరిస్థితుల వల్ల వాళ్లు కలిసే ఉండాల్సి వస్తుందేమో. అందుకే ఎవరి లైఫ్​ని బయటనుంచి చూసి జడ్జ్ చేయకండి. లేదంటే వాళ్లలా ఉండాలి.. వీళ్లలా ఉండాలి అనే ఆలోచనలకు కాస్త బ్రేక్ వేయండి.

మన చుట్టూ ఉన్నవారంతా ప్రేమలో ఉన్నా.. వారికి కలిసి ఉండే యోగ్యం ఉంటుందో లేదో ఎవరూ చెప్పలేము. ఎందుకంటే.. వారి ప్రేమకు ఇంట్లో వారు అడ్డు చెప్పవచ్చు. మతం, కులం అంటూ పెద్దలు వారిని విడదీసేయొచ్చు. లేదంటే వీరి మధ్యలో మరొకరు రావొచ్చు. లేకుంటే ఇద్దరు కలిసి బ్రేకప్ చెప్పుకోవచ్చు. అంతేకానీ వాళ్లు ప్రేమించుకున్నారు కదా లైఫ్ లాంగ్ కలిసి ఉంటారని భ్రమ పడకండి. ప్రేమించినవాడు ఎంత గొప్పవాడైనా సరే.. పెద్దలు తెచ్చిన సంబంధమే చేసుకోవాలని పట్టుపట్టే ఫ్యామిలీలు ఈరోజుల్లో చాలానే ఉన్నాయని గుర్తించుకోండి.

అలాగే కొందరికి బంధం నుంచి విడిపోయే ఆప్షన్ ఉండదు. పెళ్లి అయ్యిందనో.. పిల్లలు ఉన్నారనో.. పెద్దలు ఒప్పుకోవట్లేదనో.. విడిపోవడానికి మరోదారిలేక.. కలిసి కాపురం చేస్తున్న భార్య భర్తలు కూడా ఈ సొసైటీలో చాలామందే ఉన్నారు. ఇలా కలిసి ఉండే బదులు ఎందుకు విడిపోవచ్చు కదా అని మనం అనుకోవడంలో తప్పు లేదు. కానీ వాళ్ల పరిస్థితుల్లో మనం ఉంటేనే కానీ వాళ్లు ఎందుకు విడిపోవట్లేదో మనకు అర్థం కాదు. కళ్లతో చూసేవన్నీ నిజాలు కావనే విషయాన్ని మనం కూడా గుర్తించగలగాలి.

అలా అని ప్రేమించుకునే వారంతా విడిపోతారని కాదు.. కలిసే ఉండే వాళ్ల మధ్య ప్రేమ లేదని కాదు. కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవని మనం గుర్తించుకోవాలి. అంతేకానీ.. ప్రేమ ఎంత మధురం.. పెళ్లిల్లు స్వర్గంలోనే జరుగుతాయంట అనే మాటలు నమ్మి.. ఆ బంధాల్లో అడుగుపెట్టారనుకో.. మీ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో మీకు తెలియదు. ఎందుకంటే.. ఇద్దరు మంచివాళ్లు కూడా ఓ బంధంలో కలిసి ఉండలేకపోవచ్చు. దానికి పరిస్థితులు కూడా కారణం కావొచ్చు. ఏదో బంధం నుంచి విడిపోయినంత మాత్రానా ఇద్దరిలో ఎవరో ఒకరిది తప్పు అని ఆలోచించడం కూడా తప్పే.

ఒకవేళ మీరు ఏదైనా రిలేషన్​లోకి వెళ్లాలి అనుకుంటే.. కొన్ని విషయాల్లో రాజీపడండి. మీ ఆత్మాభిమానం దెబ్బతినేలా మాత్రం రాజీపడాల్సిన అవసరం లేదు. మీరు ఇష్టపడిన వ్యక్తి.. మీరు నచ్చలేదు అని చెప్తే ఆలోచించండి. ఎందుకంటే ఎంత ఇష్టమైనా బలవంతంగా ఇంకొకరి జీవితంలో ఉండలేము కదా. ప్రేమలేకుండా కలిసి ఉండడం కంటే.. ప్రేమతో విడిపోవడం చాలా బెటర్.

WhatsApp channel

సంబంధిత కథనం