gestational diabetes: ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ రావొద్దంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..-lifestyle changes for expecting mothers to prevent gestational diabetes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gestational Diabetes: ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ రావొద్దంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

gestational diabetes: ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ రావొద్దంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

gestational diabetes : ప్రెగ్నెన్సీ లో వచ్చే డయాబెటిస్ రాకుండా చేయొచ్చా? కొన్ని జీవనశైలి మార్పుల వల్ల అది సాధ్యమే. డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువ చేయొచ్చు.

ప్రెగ్నెన్సీ లో డయాబెటిస్ రాకుండా సలహాలు (Shutterstock)

ప్రెగ్నేన్సీ మహిళల జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులొచ్చినా కష్టమే. 25 ఏళ్ల వయసు దాటిని అమ్మాయిలకు గర్భదారణ సమయంలో జీవన శైలి లోపాల వల్ల, అధిక బరువు వల్ల, లేదా కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా వాళ్లకు కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ప్లాసెంటా విడుదల చేసే హార్మోన్ల వల్ల శరీరం ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన డయాబెటిస్ లక్షణాలన్నీ దాదాపుగా డెలివరీ తరువాత తగ్గిపోతాయి. కానీ వాళ్లకి భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. జన్యువుల వచ్చే అవకాశాన్ని పూర్తిగా తగ్గించలేం కానీ, జీవనశైలి లోపాల వల్ల షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు.

బరువు అదుపులో ఉండాలి:

జీవన శైలి మార్పుల్లో ముఖ్యమైంది ఆహారం. మొదటి నాలుగైదు నెలల్లో పెరిగే బరువు డయాబెటిస్ కి కారణం కాకపోవచ్చు. 24 నుంచి 28 వారాల్లోనే ఈ సమస్య మొదలయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో బరువు నియంత్రణలో ఉంచుకోగలిగే డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

అదే జన్యువుల ద్వారా వచ్చే డయాబెటిస్ మొదటి మూడు నెలల్లోనే రావచ్చు. దీనికోసం గర్భదారణ ముందు నుంచి ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా బరువు పెరుగుతారు. అందుకే ఎక్కువ కేలరీలు, పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. అధికంగా కొవ్వు, తీపి పదార్థాలు తినకూడదు.

ఆహారం:

ఏదయినా తినాలి అనిపిస్తుంది. కానీ బయటి ఆహారం జోలికి పోకూడదు. ఇంట్లో చేసిన వాటికే మొదటి ప్రాధాన్యత. పండ్లు, కూరగాయలు తినడం వల్ల కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరళ్లు అందుతాయి. బరువు తక్కువగా ఉంటే కాస్త కొవ్వు ఉన్న ఆహారం కూడా తొనొచ్చు. ప్రెగ్నెన్సీ అంతటా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

వాకింగ్, వ్యాయామం:

దీనివల్ల జరిగే మేలు చెప్పలేము. మొదటి మూడు నెలల్లో సరైన విశ్రాంతి మాత్రమే తీసుకోవాలి. ఈ తరువాత వాకింగ్ మాత్రం చివరి వరకూ చేయొచ్చు. ఒక గంట సేపు వాకింగ్ చేయడం, పెల్విక్ ఫ్లూర్ ఎక్స‌ర్‌సైజులు చేయడం ముఖ్యం. వీటివల్ల డయాబెటిస్ రాకుండా నియంత్రించొచ్చు.

ఒత్తిడి:

ఆనందంగా, ఉత్సాహంగా ఉండాల్సిన సమయం ఇది. మొదటి మూడు నెలల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండగలిగితే డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. రోజూవారీ పనులు చేసుకోవడం మంచిదే. కానీ ఒత్తిడి తీసుకోవద్దు.

ఇంకొన్ని సలహాలు:

ప్రాణాయామం చేయడం, ఆనందంగా ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. సరిపోయేంత నిద్ర పోవాలి. వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి.