Personal Growth । వ్యక్తిగతంగా ఎదిగిన వారిలో ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి!-big signs of personal growth therapist shares insights ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Big Signs Of Personal Growth, Therapist Shares Insights

Personal Growth । వ్యక్తిగతంగా ఎదిగిన వారిలో ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి!

HT Telugu Desk HT Telugu
May 09, 2023 08:00 PM IST

Signs of Personal Growth: వ్యక్తిగత ఎదుగుదల సాధించినపుడు మనల్ని మనం బాగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాము, మనం ఎలా ఉన్నామో అలాగే అంగీకరించడం ప్రారంభిస్తాము.

Personal Growth
Personal Growth (Unsplash)

Personal Growth: వ్యక్తిగత ఎదుగుదల అనేది ఒక వ్యక్తి పరిణితిని (Maturity) తెలియజేస్తుంది. అతడు తన జీవితాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు, మనుషులతో ఏ రకంగా స్పందిస్తున్నాడు, భావోద్వేగాలను ఎలా అదుపుచేసుకుంటున్నాడు అనే అంశాలతో ముడిపడి ఉంటుంది. ఈ ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది, సుదీర్ఘమైనది కూడా. ఎందుకంటే ఎవరైనా జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను ఎక్కువగా అనుభవించినపుడే అతడికి ఒకానొక దశలో ఈ పరిణితి అనేది వస్తుంది. మనమంతా బాల్యంలో ఒకలా, యుక్తవయస్సులో ఒకలా, నడివయసులో ఒకలా మన స్వంత భావాలతోనే విభేదిస్తూ సమయం వెళ్లదీసినవాళ్లమే. జీవితంపై అవగాహన కొందరికి చాలా చిన్న వయసులోనే ఏర్పడవచ్చు, మరికొందరికి సమయం పట్టవచ్చు.

వ్యక్తిగత ఎదుగుదల సాధించినపుడు మనల్ని మనం బాగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాము, మనం ఎలా ఉన్నామో అలాగే అంగీకరించడం ప్రారంభిస్తాము.

మెంటల్ థెరపిస్ట్ మరియా జి సోసా.. జీవితంలో జరిగే కొన్ని చిన్న విషయాలే, వ్యక్తుల్లో పెద్ద పరివర్తన మార్పులకు తోడ్పడతాయి. ఎవరైనా వ్యక్తి వ్యక్తిగతంగా ఎదిగాడు అని చెప్పటానికి వారిలో కొన్ని సంకేతాలు గమనించవచ్చు, మీలో ఆ సంకేతాలు ఉన్నాయో లేవో ఇక్కడ చూసి తెలుసుకోండి.

మనలో మనం కుమిలిపోము

వ్యక్తిగతంగా ఎదిగిన వ్యక్తి ప్రతీ అంశాన్ని లోతుగా చూడడు, ఏదైనా అంశం బాధ కలిగిస్తే బయటకు చెప్పకుండా తనలో తాను కుములిపోడు. బాధ కలిగినపుడు ఆ విషయం తనను బాధించిందని అవతలి వ్యక్తికి తెలియజేస్తాడు.

వెంటనే ప్రతిస్పందించడు

అయినదానికి, కానిదానికి వెంటనే ప్రతిస్పందించడు. ఏ విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తనకు తెలుసు. స్పందించే వాటికి స్పందిస్తాడు లేదా ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తాడు. ఎలాంటి సందర్భంలో ఆయినా బుద్ధిపూర్వకంగా వ్యవహరిస్తారు.

నిర్ణయాలపై ఆధారపడరు

ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పలువురితో సంప్రదించడం, సమాలోచనలు చేయడం మంచిదే. కానీ వ్యక్తిగతంగా ఎదిగిన వ్యక్తులు నిర్ణయాలు కూడా వారికే వదిలేయరు, తమకంటూ సొంత నిర్ణయం ఉంటుంది. వారి నిర్ణయానికి వారే బాధ్యత వహిస్తారు.

అనవసరపు వాదనలకు దూరం

కొన్నిసార్లు వాదించకపోవడమే మంచిది. కొందరితో వాదించడం వలన మన మనశ్శాంతిని కోల్పోతాము. ఈ విషయంపై అవగాహన కలిగినవారు, అనవసరపు వాదనలకు దూరంగా ఉంటారు. వారితో వాదించి నెగ్గాలని అనుకోరు. వారికి అర్థమయ్యేలా చేయడానికి తమ శక్తిని వృధా చేసుకోరు.

సహవాసం

ఇది వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించిన ప్రాథమిక సంకేతాలలో ఒకటి. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఎదిగినపుడు సోలోగా ఉన్నా, ఆనందంగా ఉంటాడు. వారితో ఎవరూ లేకపోయినా, ఒంటరిగా భావించడు. తన స్వంత సహవాసాన్ని సైతం ఆస్వాదిస్తాడు. ఏకాంతాన్ని ప్రేమిస్తారు, ఒంటరితనం అనుభూతి అనేది వారికి ఉండదు.

సరిహద్దులు విధించుకుంటారు

ఎక్కడైనా పరిస్థితులు విషపూరితంగా మారినపుడు అందులోనే కొనసాగరు. తమకంటూ కొన్ని వ్యక్తిగత సరిహద్దులను కలిగి ఉంటారు. ఎవరితో ఎంతవరకు మెలగాలో, ఎవరితో ఎంత చనువుగా ఉండాలో అంతే ఉంటారు. తమ పరిధి దాటి ఇంకొకకరి సమస్యలలో వేలు పెట్టాలని అనుకోరు. తమని తాము ఎలా రక్షించుకోవాలో వారికి తెలుసు.

WhatsApp channel

సంబంధిత కథనం