Control Your Emotions | భావోద్వేగాలను నియంత్రించడం ఎలా?
Control Your Emotions: మీలోని భావోద్వేగాలు గతి తప్పుతున్నాయా? భావోద్వేగాల నియంత్రణకు థెరపిస్టులు సూచించిన కొన్ని మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.

Control Your Emotions: భావోద్వేగాలు అనేవి వాస్తవాలు కావు, అవి వివిధ పరిస్థితులకు మనం కనబరిచే ప్రతిస్పందనలు మాత్రమే. విభిన్న పరిస్థితుల్లో విభిన్న భావోద్వేగాలు కలుగుతాయి. ఇవి అందరిలో కూడా ఒకేలా ఉండవు, ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా భావోద్వేగం చెందుతారు. కోపాన్ని ప్రదర్శించడం మొదలుకొని, ప్రేమగా మాట్లాడటం వరకు పరిస్థితులకు తగ్గట్లుగా మనం అనుభూతి చెందుతూ కనబరిచే ప్రవర్తనే భావోద్వేగం. ఈ భావోద్వేగాలు మన జీవితంలో మన ప్రవర్తనను, మన నడవడికను నిర్ధారించగలవు. మన నిర్ణయాలపై ఆదిపత్యం చెలాయించగలవు. మొత్తంగా ఈ భావోద్వేగాలు మన జీవితాన్ని శాసించగలవు.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన భావోద్వేగాలు మనల్ని సరైన దిశలో నడిపించినపుడు ఎలాంటి సమస్య లేదు, కానీ ఇవి మీలో విపరీత ధోరణిలకు దారితీస్తున్నప్పుడు, మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నప్పుడు, మీ జీవితంలో సమస్యలను స్టృష్టిస్తున్నప్పుడు మీ భావోద్వేగాలపై దృష్టిపెట్టడం ఎంతైనా అవసరం.
Ways To Control Emotions- భావోద్వేగాల నియంత్రణకు మార్గాలు
మీ భావోద్వేగాలపై మీకు నియంత్రణ ఉండాలంటే ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి చూడండి.
భావోద్వేగంపై అవగాహన
మీరు మీ భావోద్వేగాలను అర్థం చేసుకోండి. దాని వలన మీరు ఎలా అనుభూతి చెందుతున్నారో గమనించండి. మీరు ఈ దశలో అనుభవించే సంఘర్షణను కూడా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ఆలోచించండి. తదనుగుణంగా వ్యవహరించండి.
ఒక్క క్షణం ఆగండి
మీరు తీవ్రమైన భావోద్వేగాలను అనుభవిస్తున్నప్పుడు వెంటనే ప్రతిస్పందించకుండా ఒక్క క్షణం ఆగండి. మీ రియాక్షన్ ను వాయిదా చేయండి. ఇది నెమ్మదిగా మిమ్మల్ని ఆ పరిస్థితి నుంచి బయటకు నెట్టివేస్తుంది.
ప్రేరణను అడ్డుకోండి
మీరు ఒత్తిడికి గురైనప్పుడు, భావోద్వేగాలకు లోనయినపుడు మీ మనసు ఏదో ఒకటి చేసేయాలని మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. వాస్తవిక దృశ్యాన్ని ఊహించుకొని మీ ప్రేరణలకు అడ్డుకట్టవేయండి.
మిమ్మల్ని మీరు ఓదార్చుకోండి
మీరు కోపం, బాధ, అసహ్యం వంటి తీవ్రమైన భావోద్వేగాలను అనుభవిస్తున్నప్పుడు వెంటనే ఒక నిర్ణయానికి రాకుండా, కాస్త శాంతంగా వ్యవహరించండి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు ఓదార్చుకోండి. ఈ పరిస్థితి మారుతుందని సర్దిచెప్పుకోండి. కాసేపు నడకకు వెళ్లడం, లేదా ఏదైనా పనిలో నిమగ్నం అవండి.
స్పందనలను ఎంచుకోండి
భావోద్వేగాలు కలిగినపుడు ఏదోరకంగా ప్రతిస్పందించకుండా ఆప్షన్లు అనుకోండి. అందులోంచి మనం ఎలా స్పందించాలో ఎంచుకోవాలి. మనం ఎలా ప్రతిస్పందించాలనుకుంటున్నామో తెలియజేసే నిర్ణయం తీసుకున్నప్పుడు, మనపై మనం మరింత విశ్వాసాన్ని పొందుతాము.
సంబంధిత కథనం