Are You a Virgin : మీరు వర్జిన్ ఆ? చేసే ముందు ఇవి తెలుసుకోవాల్సిందే-are you a virgin here are some tips for first time experience ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Are You A Virgin Here Are Some Tips For First Time Experience

Are You a Virgin : మీరు వర్జిన్ ఆ? చేసే ముందు ఇవి తెలుసుకోవాల్సిందే

HT Telugu Desk HT Telugu
Feb 21, 2023 08:50 PM IST

Tips To Virgin : ఫస్ట్ టైమ్ సెక్స్‌లో పాల్గొనడంపై చాలా మందికి అపోహలు ఉంటాయి. ఇక ఒత్తిడి సహజం. అయితే మెుదటిసారి చేసే దానితో తర్వాత కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే కొన్ని చిట్కాలు తెలుసుకోవాలి. మానసికంగానూ సిద్ధంగా ఉండాలి.

వర్జిన్ టిప్స్
వర్జిన్ టిప్స్ (unsplash)

మెుదటిసారి సెక్స్(Sex) అనగానే.. చాలా మంది భయపడుతుంటారు. ఫస్ట్ ఎలా అవుతుందో ఎలా బిహేవ్ చేయాలో తెలియక తికమక పడుతుంటారు. మరోవైపు ఒత్తిడి(Stress) కూడా ఉంటుంది. కొన్ని విషయాలు ముందుగానే తెలుసుకుంటే.. ఎలాంటి సమస్య ఉండదు. అన్నింటినీ మరచిపోయి, మీ భాగస్వామితో సన్నిహిత క్షణాలను ఆస్వాదించండి.

ఫస్ట్ టైమ్ సెక్స్(First Time Sex) చేయడం వల్ల వచ్చే ఒత్తిడితో అంగస్తంభన సమస్యలు, సడెన్ గా స్కలనానికి దారితీయవచ్చు. ఇది చాలా సాధారణ సమస్య. భయపడవద్దు. మీ శరీరం యోని సంభోగానికి అలవాటు పడిన తర్వాత శీఘ్ర స్ఖలనం కాలక్రమేణా పోతుంది. ఆ భయం పెట్టుకుంటే.. తర్వాత కూడా ఇదే సమస్యలు వస్తాయి. మెుదటిసారి కాబట్టి.. ఎంతైనా ఒత్తిడి, ఎక్సైట్ మెంట్ సహజం.

చాలా మంది మహిళలు.. పురుషులు ఫోర్ ప్లే కోసం తగినంత సమయాన్ని వెచ్చించడం లేదని ఫిర్యాదు చేస్తారు. అన్నింటికీ తొందరపడకండి. ముద్దులు, ఫోర్‌ప్లే, ఓరల్ సెక్స్, మ్యూచువల్ హస్తప్రయోగం, నెక్కింగ్, డ్రై హంపింగ్, రుద్దడం, మసాజ్‌లు, మరెన్నో చేయండి. చాలా మంది మహిళలు యోని సంభోగం ద్వారా భావప్రాప్తి పొందలేరు. అందుకే రొమాన్స్ చాలా ముఖ్యం.

మీ భాగస్వామితో సెక్స్(Sex) గురించి చర్చించడానికి సంకోచించకండి. సెక్స్ సమయంలో మీ భయాల గురించి మాట్లాడండి. వారి ఇష్టాలు, అయిష్టాల గురించి అడగండి. సెక్స్ ద్వారా ఏం ఆశిస్తున్నారో తెలుసుకోండి. ఎలా చేస్తే.. హ్యాపీ అవుతారో అడగాలి. మీకున్న ఊహలు, అంచనాల గురించి చెప్పండి. మొదటి సారి భయం ఉండొచ్చు. కానీ మీరు మీ వంతు ప్రయత్నం చేయబోతున్నారని వారికి అర్థమయ్యేలా చేయండి. మొదటిసారే ఎవరూ పరిపూర్ణులు కారు.

మీ పురుషాంగం కొన సెన్సిటివ్‌గా ఉండవచ్చు. లేదా మొదటిసారిగా సెక్స్ సమయంలో ఆమెకు హాని కలిగించవచ్చని గుర్తుంచుకోండి. చెప్పలేం.. మీకు కూడా కాస్త నొప్పిగానే ఉండొచ్చు. సెక్స్ సమయంలో నొప్పి స్త్రీలలో చాలా సాధారణం. సరళత లేకపోవడం వల్ల వస్తుంది. మీరు కూడా ఆవేశంగా కాకుండా కాస్త నిదానంగా చేయాలి. అప్పుడు ఇద్దరికీ నొప్పి నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుంది.

సెక్స్‌లో పాల్గొనే ముందు కండోమ్‌(Condom)లను మీ వెంట తీసుకెళ్లాలని నిర్ధారించుకోండి. అసురక్షిత సెక్స్ అవాంఛిత గర్భాలు లేదా STD లకు దారి తీస్తుంది. సంభోగం, ఓరల్ సెక్స్ రెండింటికీ పరిశుభ్రత చాలా ముఖ్యం. కాబట్టి ఓరల్ సెక్స్ కోసం ఫ్లేవర్డ్ కండోమ్‌ను ఉపయోగించడం మంచిది. ఎందుకంటే ఇది పరిశుభ్రమైనది.

WhatsApp channel

టాపిక్