Cracked Dry Hands : మీ చేతులు పొడిబారకుండా కాపాడుకోవడానికి చిట్కాలు-4 tips to protect your hands from cracked dry try this home remedies ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  4 Tips To Protect Your Hands From Cracked Dry Try This Home Remedies

Cracked Dry Hands : మీ చేతులు పొడిబారకుండా కాపాడుకోవడానికి చిట్కాలు

HT Telugu Desk HT Telugu
Mar 05, 2023 09:31 AM IST

Cracked Dry Hands : ఎండాకాలం కొంతమంది చేతులు చాలా పొడిగా మారుతాయి. దీనినుంచి ఉపశమనం పొందెందుకు మీరు కొన్ని హోం రెమెడీస్‌ను తీసుకోవచ్చు. ఇది మీ చేతులను మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.

పొడిబారిన చేతులు
పొడిబారిన చేతులు

రసాయన ఉత్పత్తులు, సబ్బు(Soap), అగరబత్తికి గురికావడం వల్ల, మన చేతులు పొడిబారడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మరికొంతమంది చాలా సార్లు తమ చేతులను జాగ్రత్తగా చూసుకుంటారు. దానికోసం సబ్బులు అవి ఇవి రాస్తారు. ఇది కూడా పొడిబారడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. ఇందుకోసం మీరు కొన్ని హోం రెమెడీస్‌(homeremedies)ను పాటిస్తే.. ఇది మీ చేతులను మృదువుగా ఉంటాయి.

కొబ్బరినూనె(Coconut Oil)ను ఇళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నూనెను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. చేతులు పొడిబారడాన్ని తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ నూనె మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీంతో చేతులు పొడిబారకుండా ఉంటాయి. చేతులు పొడిబారకుండా ఉండాలంటే ఈ నూనెను కొన్ని చుక్కలను మీ అరచేతులపై వేయండి. నూనె పూర్తిగా వ్యాపించే వరకు నెమ్మదిగా మీ చేతులను(Hands) రుద్దడం ప్రారంభించండి. మీరు రెగ్యులర్ గా ఈ నూనెతో మసాజ్ చేసుకోవచ్చు.

వైద్య శాస్త్రం ప్రకారం, అలోవెరా(Aloevera) జెల్ పొడి చర్మంపై ఉపయోగించవచ్చు. ఇది చేతుల తేమను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం చేతులకు కొద్దిగా అలోవెరా జెల్‌ను పట్టించాలి. చేతులకు రుద్దండి. అలోవెరా జెల్‌ని చేతులకు సమానంగా అప్లై చేయాలి. డ్రై స్కిన్‌ని(Dry Skin) తొలగించడానికి సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

మీరు తేనె(Honey)ను ఉపయోగించవచ్చు. చేతుల పొడిని తొలగించడానికి మీరు తేనెను వాడితే మంచి ఫలితం ఉంటుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని(Skin) మెరుగుపరచడానికి, మృదువుగా చేయడానికి పనిచేస్తుంది. దీని కోసం, మీరు మీ చేతులకు తేనెను పూయవచ్చు. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. దీని తర్వాత నీటితో కడగాలి.

చేతుల పొడిని తొలగించడానికి మీరు పెట్రోలియం జెల్లీని ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇందుకోసం చేతులు కడుక్కొని పెట్రోలియం జెల్లీతో మసాజ్ చేసుకోవాలి. కొన్ని గంటలపాటు అలానే వదిలేయండి.

WhatsApp channel