Yatra 2 Movie: సేవ్ ది టైగర్స్ తర్వాత ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లతో రాబోతోన్న మహి వి. రాఘవ్
Yatra 2 Movie: సేవ్ ది టైగర్స్ తర్వాత వై.ఎస్ జగన్ బయోపిక్‌తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు దర్శకుడు మహి.వి.రాఘవ్ సిద్ధమయ్యారు. ఆ సినిమాలు, సిరీస్‌లు ఏవంటే...
Yatra 2 Movie: దర్శకుడు మహి.వి. రాఘవ్ క్రియేటర్‌గా వ్యవహరించిన సేవ్ ది టైగర్స్ వెబ్‌సిరీస్ ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది. భార్యల డామినేషన్ కారణంగా ఇబ్బందులు పడే ముగ్గురు భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తుల కథతో రూపొందిన ఈ సిరీస్‌కు ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ కాంబినేషన్‌లోని కామెడీ సీన్స్ ను ఓటీటీ ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోన్నారు. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా తేజ కాకుమాను మెప్పించాడు. జోర్ధార్ సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి యాక్టింగ్ బాగుందంటూ చెబుతోన్నారు.
సేవ్ ది టైగర్స్‌తో కొంత విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు మహి. వి.రాఘవ్. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లపై ఆయన ఆసక్తికర విషయాల్ని పంచుకోన్నాడు.
యాత్ర -2
వైఎస్ జగన్ జీవితం ఆధారంగా యాత్ర -2 తెరకెక్కించబోతున్నట్లు చాలా రోజుల క్రితమే మహి. వి రాఘవ్ అనౌన్స్‌చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మరో రెండు, మూడు నెలల్లోనే సెట్స్‌పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది త్వరలోనే హీరో ఎవరన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు మహి. వి రాఘవ్ పేర్కొన్నాడు.
లేడీ ఓరియెంటెడ్ మూవీ...
అలాగే మహి.వి రాఘవ్ దర్శకత్వంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోన్న సిద్ధా... లోకం ఎలా ఉంది నాయన సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. సేవ్ ది టైగర్స్ కొనసాగింపుగా రెండో సీజన్ కథను మహి. వి రాఘవ్ రెడీ చేశారు.
హీరోయిన్ కిడ్నాప్ చేసిన నేరం కారణంగా ముగ్గురు స్నేహితుల జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలను వినోదాత్మకంగా సెకండ్ సీజన్‌లో చూపించబోతున్నారు. అలాగే మహి వి. రాఘవ్ క్రియేటర్‌గా వ్యవహరిస్తోన్న మరో వెబ్‌సిరీస్ సైతాన్ కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సిరీస్ బోల్డ్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్నట్లు తెలిసింది.