Vijay Deverakonda Sekhar Kammula Movie: విజయ్ దేవరకొండ శేఖర్ కమ్ముల కాంబినేషన్ ఫిక్సయిందా
Vijay Deverakonda Sekhar Kammula Movie: లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత పదేళ్ల విరామం అనంతరం దర్శకుడు శేఖర్ కమ్ములతో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడు మొదలుకానుందంటే...
Vijay Deverakonda Sekhar Kammula Movie: సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల 2012లో రూపొందించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన చిన్న పాత్రలో నటించాడు విజయ్ దేవరకొండ. నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తోన్న రోజుల్లో విజయ్ టాలెంట్‌ను గుర్తించి శేఖర్ కమ్ముల అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయ్ దేవరకొండ తెలుగులో స్టార్ హీరోగా మారిపోయాడు.
దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి విజయ్ దేవరకొండ, శేఖర్ కమ్ముల కాంబినేషన్ వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నట్లు సమాచారం. శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేసేందుకు విజయ్ ఆసక్తిని చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతోన్నట్లు సమాచారం. లైగర్ రిజల్ట్ తర్వాత కథల ఎంపికలో విజయ్ దేవరకొండ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
కొద్ది రోజుల పాటు మాస్, యాక్షన్ కథాంశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ ఆలోచనతోనే శేఖర్ కమ్ములతో అతడు సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు వార్తలొస్తున్నాయి. రియలిస్టిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరలో ఈసినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తెలుగులో ఖుషి సినిమా చేస్తోన్నాడు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే లైగర్ తర్వాత పూరి జగన్నాథ్‌తో జనగణమన అనే సినిమ చేయబోతున్నట్లు విజయ్ ప్రకటించాడు. ఆఫీషియల్‌గా ఈ సినిమాను లాంఛ్ చేశారు. కానీ లైగర్ ఫెయిల్యూర్‌గా నిలవడంతో జనగణమనను పక్కనపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ రెండు సినిమాల్ని అంగీకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.