Vicky Kaushal: భారత్-పాక్ యుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో మూవీ.. సామ్ బహదూర్ టీజర్ రిలీజ్
Vicky Kaushal Sam Bahadur Teaser: బాలీవుడ్ పాపులర్ యాక్టర్ విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సామ్ బహదూర్. డిఫరెంట్ చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్న విక్కీ కౌశల్ సామ్ బహదూర్ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ విశేషాల్లోకి వెళితే..
బాలీవుడ్ హాట్ బ్యూటి కత్రీనా కైఫ్ ప్రియుడు, భర్తగా చాలా పాపులర్ అయిన విక్కీ కౌశల్ కెరీర్ మొదటి నుంచి ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ అలరిస్తున్నాడు. కొత్త కథలతో బాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఉరి సినిమాతో దేశవ్యాప్తంగా హిట్ కొట్టిన విక్కీ కౌశల్.. లస్ట్ స్టోరీస్ వంటి ఓటీటీ వెబ్ సిరీసుతో అట్రాక్ట్ చేశాడు. ఇటీవల గోవిందా నామ్ మేరా మూవీతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్కీ జర హట్కే జర బచ్కే సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు.
ఇప్పుడు సామ్ బహదూర్ (Sam Bahadur Movie) అనే మూవీతో ప్రేక్షకులను మరోసారి కట్టిపడేసేందుకు రెడీ అయ్యాడు విక్కీ కౌశల్. సర్దార్ ఉద్దమ్ మూవీ తర్వాత విక్కీ నటిస్తున్న బయోపిక్ మూవీ ఇది. 1971లో ఇండో-పాక్ వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ యుద్ధంలో భారత్ విజయానికి కారణమైన "సామ్ మానెక్షా" (Sam Manekshaw) జీవిత కథ ఆధారంగా సామ్ బహదూర్ తెరకెక్కింది.
సామ్ బహదూర్ సినిమాలో సామ్ మానెక్ష పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తుండగా.. ఇందిరా గాంధీ పాత్రలో దంగల్ బ్యూటి సనా ఫాతిమా షేక్ యాక్ట్ చేసింది. తాజాగా సామ్ బహదూర్ టీజర్ విడుదల చేశారు. ఇందులో మెయిన్ లీడ్ రోల్‌లో విక్కీ ఆకట్టుకున్నాడు. బాడీ లాంగ్వెజ్, డైలాగ్ డెలివరీ చాలా రియలిస్టిక్‌గా ఉండి సామ్ మానెక్షా పాత్రకు సరిగ్గా సరిపోయాడు. సైన్యానికి విక్కీ ట్రైనింగ్ ఇచ్చే విధానం, ఇందిరా గాంధీ, సామ్ బహదూర్ మధ్య సీన్స్ ఆకట్టుకున్నాయి. బీజీఎమ్ బాగుంది.
సామ్ బహదూర్ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. సినిమాలో విక్కీ, సనా, సాన్య మల్హోత్రా, ఎడ్వర్డ్ సొనెన్ బ్లిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా ఫీల్డ్ మార్షల్ సామ్ జంషద్ జీ మానెక్షా ఇండియన్ ఆర్మీని నాలుగు దశబ్దాల పాటు ముందుండి నడిపించారు. ఆయన్ను పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం సత్కరించింది.
టాపిక్