Varisu Budget: వారిసు బడ్జెట్‌ లెక్క తప్పిందా? ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఎంత?-varisu budget is more than the expected figure ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varisu Budget: వారిసు బడ్జెట్‌ లెక్క తప్పిందా? ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఎంత?

Varisu Budget: వారిసు బడ్జెట్‌ లెక్క తప్పిందా? ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఎంత?

Hari Prasad S HT Telugu
Jan 04, 2023 09:58 PM IST

Varisu Budget: వారిసు బడ్జెట్‌ లెక్క తప్పింది. గతంలోనూ చాలా వరకూ తాను చెప్పిన బడ్జెట్‌లో సినిమాలు చేయలేడని పేరున్న డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి.. వారిసు విషయంలోనూ అదే చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

వారిసు మూవీలో విజయ్
వారిసు మూవీలో విజయ్

Varisu Budget: సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఒకటి వారిసు. తెలుగులో వారసుడుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళ సూపర్‌ స్టార్‌ దళపతి విజయ్‌ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రెండు భాషల్లో రిలీజ్‌ కానుండటం, తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి, బాలయ్య సినిమాల కంటే ఎక్కువ థియేటర్లు లభించడంతో కలెక్షన్లు భారీగా రానున్నాయని భావిస్తున్నారు.

అయితే ఈ సినిమా బడ్జెట్‌ విషయంలోనూ లెక్క తప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా అనుకున్న బడ్జెట్‌ కంటే వారిసు మూవీకి రూ.30 కోట్లు ఎక్కువ ఖర్చయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను 100 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉండగా.. మరో 45-50 రోజులు ఎక్కువ అయ్యాయి. తాను చెప్పిన బడ్జెట్‌ కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టించడం డైరెక్టర్‌ వంశీ పైడిపల్లికి అలవాటని పేరుంది.

ఇప్పుడు వారసుడు విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.200 కోట్లుగా చెబుతున్నారు. అయితే వంశీతో గతంలోనూ సినిమాలు తీసిన దిల్‌ రాజు అతనిపై నమ్మకంతో బడ్జెట్‌ ఎక్కువైనా వెనక్కి తగ్గలేదు. ఈ సినిమా నాన్‌-థియేట్రికల్‌ హక్కుల ద్వారానే రూ.150 కోట్లు రావడం విశేషం. ఇందులో శాటిలైట్, డిజిటల్‌, ఆడియో, డబ్బింగ్‌ హక్కులు ఉన్నాయి.

ఇక సినిమా థియేట్రికల్‌ హక్కులను కూడా రూ.139 కోట్లకు అమ్ముకున్నారు. తమిళనాడులో సెవన్‌ స్క్రీన్‌ స్టూడియోస్ రూ.70 కోట్లతో ఈ హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.35 కోట్లు దక్కాయి. ఇక డిజిటల్‌ హక్కులు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకోగా.. శాటిలైట్‌ హక్కులు సన్‌ టీవీ చేతికి దక్కాయి.

వారసుడు మూవీ ట్రైలర్‌ బుధవారం (జనవరి 4) రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న రిలీజ్‌ కానుంది. అదే రోజు తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకు ఒక రోజు ముందు అజిత్‌ నటించిన తునివు, ఒక రోజు తర్వాత చిరంజీవి వాల్తేర్‌ వీరయ్య రిలీజ్ కానున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం