Tamannaah Bubbly Bouncer : తమన్నా బాలీవుడ్ సినిమా డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్
తమన్నా( Tamannaah)హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం బబ్లీబౌన్సర్(Bubbly Bouncer) రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈసినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందంటే...
Tamannaah Bubbly Bouncer Release Date: బాలీవుడ్ లో హిట్ దక్కించుకోవాలని దాదాపు దశాబ్దకాలంగా ప్రయత్నాలు చేస్తోంది తమన్నా. కానీ ఆమె కల మాత్రం తీరడం లేదు. సౌత్‌లో నెంబర్‌వన్ హీరోయిన్లలో ఒకరిగా చెలామణి అయిన ఈ మిట్కీబ్యూటీకి బాలీవుడ్‌లో వరుస పరాజయాలే మిగిలాయి. అయినా పట్టువదలకుండా హిందీలో సినిమాలు చేస్తూనే ఉంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో బబ్లీబౌన్సర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది తమన్నా. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో హిట్ కోరిక తీరుతుందని అనుకున్న తమన్నాకు మరోసారి నిరాశే మిగిలింది. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో బబ్లీ బౌన్సర్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు మధుర్ భండార్కర్ ప్రకటించారు. బబ్లీ బౌన్సర్ ను సెప్టెంబర్ 23న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. హిందీతో పాటు తెలుగు,,తమిళ భాషల్లో విడుదలకానున్నట్లు వెల్లడించాడు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయని ప్రకటించిన మధుర్ భండార్కర్ తమన్నాతో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఈ సినిమాలో తమన్నా బౌన్సర్ పాత్రలో కనిపించబోతున్నది. పురుషాధిక్యతతో కూడిన ఈ రంగంలో ఓ మహిళ ఎలా రాణించిందనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తన కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటని తమన్నా చెప్పింది. బబ్లీ బౌన్సర్‌తో పాటు తమన్నా నటిస్తున్న మరో హిందీ చిత్రం ప్లాన్ ఏ ప్లాన్ బీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది.
మరోవైపు తెలుగులో చిరంజీవి సరసన భోళాశంకర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది తమన్నా. అలాగే సత్యదేవ్‌తో కలిసి తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.