Saindhav First Review: సైంధవ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఫుల్ పాజిటివ్ టాక్ - ఇండస్ట్రీ రిపోర్ట్ ఇదే!
Saindhav First Review: వెంకటేష్ సైంధవ్ సినిమాకు ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి ఫుల్ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తోన్నాయి. వెంకటేష్ క్యారెక్టరైజేషన్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయంటూ సినిమా చూసిన టాలీవుడ్ సెలబ్రిటీలు చెబుతున్నారు.
Saindhav First Review: సైంధవ్‌తో లాంగ్ గ్యాప్ తర్వాత సంక్రాంతి బరిలో నటించాడు హీరో వెంకటేష్. జనవరి 13న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధానికి యాక్షన్, మాఫియా అంశాలను టచ్ చేస్తూ దర్శకుడు శైలేష్ కొలను సైంధవ్ మూవీని తెరకెక్కించాడు.
స్పెషల్ స్క్రీనింగ్...
టాలీవుడ్ సెలబ్రిటీల కోసం బుధవారం సైంధవ్ మూవీని స్పెషల్‌గా స్క్రీనింగ్ చేసినట్లు సమాచారం. ఈ స్క్రీనింగ్‌కు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వారంతా అవుట్‌పుట్ విషయంలో హ్యాపీగా ఫీలైనట్లు సమాచారం. వెంకటేష్ క్యారెక్టరైజేషన్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్, ఫ్యామిలీ బాండింగ్ ఎపిసోడ్స్ బాగున్నాయంటూ ప్రశంసలు కురిపించినట్లు వార్తలొస్తున్నాయి. సినిమాలో సింగిల్ డల్ మూమెంట్ సీన్ కూడా కనిపించలేదని సెలబ్రిటీలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
యాక్షన్ రోల్‌లో వెంకీ...
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్‌లో వెంకీ ఇరగదీశాడని అంటున్నారు. ఆయన డైలాగ్స్, స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు హైలైట్‌గా ఉంటాయని స్పెషల్ ప్రీమియర్స్ నుంచి టాక్ వచ్చింది. ఈ ప్రీమియర్స్‌కు పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో మూవీ టీమ్ ఆనందంలో మునిగితేలుగుతోంది. ప్రీమియర్స్ టాక్‌కు సంబంధించిన వీడియోను ప్రమోషనల్ కంటెంట్‌గా రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
గ్యాంగ్‌స్టర్‌గా...
సైంధవ్ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా, ఓ చిన్నారికి తండ్రిగా డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో వెంకటేష్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌తో పాటు రుహాణి శర్మ, ఆండ్రియాతో పాటు తమిళ హీరో ఆర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైంధవ్‌లో బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ విలన్‌గా నటిస్తున్నాడు. వెంకటేష్, నవాజుద్ధీన్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయని సమాచారం. ఈ సినిమా కోసం తెలుగులో నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం.
పాన్ ఇండియన్ లెవెల్‌లో...
సైంధవ్ సినిమా పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. వెంకటేష్ ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీగా సైంధవ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఇరవై నాలుగు కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో సైంధవ్ రిలీజ్ అవుతోంది. సైంధవ్ సినిమాను గత ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సలార్ బరిలోకి రావడంతో సంక్రాంతికి మూవీ వాయిదాపడింది.
సంక్రాంతికి పోటీ...
ఈ సంక్రాంతికి సైంధవ్‌తో పాటు మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగతో పాటు తేజా సజ్జా హనుమాన్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. సైంధవ్ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నాడు. హిట్, హిట్ -2 సక్సెస్‌ల తర్వాత శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.