Sagileti Katha OTT Streaming: హీరో నవదీప్ ప్రజెంటర్‌గా వ్యవహరించిన చిన్న సినిమా సగిలేటి కథ ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిసెంబర్ 22 ( శుక్రవారం) నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. సగిలేటి కథ సినిమాలో రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ హీరోహీరోయిన్లుగా నటించారు.
రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 13న థియేటర్లలో విడుదలైంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు రాజశేఖర్ సగిలేటి కథ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాకు ముందు రవి మహాదాస్యం పలు షార్ట్ ఫిలిమ్‌లలో నటించాడు. ట్రైలర్, టీజర్స్‌తో సగిలేటి కథ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నా భారీ పోటీ మధ్య రిలీజ్ కావడంతో సినిమా విజయాన్ని సాధించలేకపోయింది.
సగిలేరు అనే ఊరిలో గంగాలమ్మ జాతర చేయాలని ఊరి పెద్దలు సంకల్పిస్తారు. ఆ జాతరలో జరిగిన గొడవలో ఊరి పెద్ద చౌడప్ప...ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేసే దొరసామిని చంపేస్తాడు.దొరసామి కూతురు కృష్ణవేణిని చౌడప్ప కొడుకు కుమార్ ప్రాణంగా ప్రేమిస్తాడు.
జాతరలో జరిగిన గొడవల కారణంగా వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? దొరసామిని చౌడప్ప ఎందుకు చంపాడు? తన తండ్రిని చంపిన చౌడప్పపై కృష్ణ వేణి ఎలా ప్రతీకారం తీర్చుకున్నది అన్నదే సగిలేటి కథ మూవీ సినిమా స్టోరీ.