Police Case Against Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్‌పై పోలీసు కేసు.. మనోభావాలు దెబ్బతీశారంటూ హిందు సంఘాల ఫిర్యాదు
Police Case Against Devi Sri Prasad: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై పలు హిందూ సంఘాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన రూపొందించిన ఓ పరి సాంగ్‌లో పదాలు హిందువులు మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు.
Police Case Against Devi Sri Prasad: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కొత్త వివాదంలో చిక్కుకుకున్నారు. ఆయనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేవిశ్రీ ప్రసాద్ తమ మనోభావాలను దెబ్బతీశారంటూ పలు హిందూ సంఘాలు సైబర్ క్రైమ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాయి. వీరితో పాటు ప్రముఖ నటి కరాటే కల్యాణి కూడా ఉండటం గమనార్హం. పవిత్రమైన మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో చిత్రీకరించి హిందువులను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
విషయంలోకి వస్తే దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల విడుదల చేసిన పాన్ఇండియా సాంగ్ ఓ పరి(O Pari) హరేరామ హరేకృష్ణ అనే పదాలను ఉన్న విషయం తెలిసిందే. అయితే హిందువులు పవిత్రంగా పిల్చుకునే ఈ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో ఉన్న ఐటెం సాంగ్‌లో చిత్రీకరించారని హిందూ సంఘాలు ఆరోపించాయి. వెంటనే ఆ గీతంలో వినిపించే ఆ మంత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా దేవిశ్రీ ప్రసాద్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు.
పాటలో ఆ మంత్రాన్ని తొలగించగించాలని, లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రముఖ నటి కరాటే కల్యాణి హెచ్చరించింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయసలహా తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ పాటను ఆయనే ఆలపించారు. అంతేకాకుండా ఈ ఆల్బమ్ ఆయన నటించారు కూడా. ఈ సాంగ్ పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో గత నెలలో విడుదలైంది. తెలుగులో ఓ పిల్లా పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి శ్రోతలను అలరించింది.
సంబంధిత కథనం