Nagarjuna Comments on Pawan Kalyan: పవన్ కళ్యాణ్, కార్తి అరుదైన హీరోలు - నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nagarjuna Comments on Pawan Kalyan: సర్దార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్‌కళ్యాణ్‌పై నాగార్జున ప్రశంసలు కురిపించాడు. పవన్‌కళ్యాణ్, కార్తి, పునీత్ రాజ్‌కుమార్ అరుదైన నటులని పేర్కొన్నాడు.
Nagarjuna Comments on Pawan Kalyan: బుధవారం జరిగిన సర్దార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్‌కళ్యాణ్‌పై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కార్తి హీరోగా నటిస్తున్న సర్దార్ సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాను తెలుగులో నాగార్జున రిలీజ్ చేస్తున్నాడు. బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరిగింది. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో పాటు కార్తి, పునీత్ రాజ్‌కుమార్‌పై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కార్తి అన్నయ్య సూర్య (Surya) ఓ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నాడని నాగార్జున అన్నాడు. అన్నయ్య సూపర్ స్టార్ ఇమేజ్ షాడో నుంచి బయటకు వచ్చి తమకంటూ సొంత ఐడెంటిటి ఏర్పరచుకున్న నటులు చాలా తక్కువ మంది ఉన్నారని నాగార్జున పేర్కొన్నాడు.
అలాంటి వాళ్లను తాను అరుదుగా చూసినట్లు చెప్పాడు. ఓ ముగ్గురు మాత్రమే తనకు కనిపించారని పేర్కొన్నాడు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు పవన్ కళ్యాణ్‌లో ఆ లక్షణం కనిపిస్తే కన్నడంలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar), తమిళంలో సూర్య తమ్ముడు కార్తి మాత్రమే అన్నయ్య ఇమేజ్ నుంచి బయటకు వచ్చి హీరోలుగా విజయాల్ని అందుకున్నారని నాగార్జున అన్నాడు.
ఈ ఇమేజ్‌ను బ్రేక్ చేయడం ఈజీ కాదని, ఎంతో కష్టపడి నటులుగా ఎదిగారని నాగార్జున అన్నాడు. బోల్డ్‌గా కొత్తరకమైన కథలను ఎంచుకుంటూ అన్నయ్య సూర్య అంత ఎత్తుకు కార్తి ఎదిగాడని నాగార్జున ప్రశంసలు కురిపించాడు.
కార్తి తెలుగులో పాటలు పాడుతాడని, చక్కగా మాట్లాడుతాడని, అందుకే అతడిని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అన్నాడు. గతంలో నాగార్జున, కార్తి కలిసి ఊపిరి సినిమా చేశారు.