Naa Saami Ranga vs Saindhav: వెంకీపై నాగ్‌దే పైచేయి - రెండో రోజు పెరిగిన నా సామిరంగ కలెక్షన్స్ - సైంధవ్ డీలా
Naa Saami Ranga vs Saindhav: నాగార్జున నా సామిరంగ కలెక్షన్స్ రెండో పెరిగాయి. సోమవారం రోజు ఈ మూవీ 4.55 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మరోవైపు వెంకటేష్ సైంధవ్ మూవీ బాక్సఫీస్ వద్ద పూర్తిగా డీలా పడింది. మూడు రోజుల్లో ఐదున్నర కోట్లు మాత్రమే వసూళ్లను దక్కించుకున్నది.
Naa Saami Ranga vs Saindhav: నాగార్జున నా సామిరంగ మూవీ కలెక్షన్స్ రెండో రోజు పెరిగాయి. తొలిరోజు 4.33 కోట్ల కలెక్షన్స్ సాధించిన నా సామిరంగ మూవీ రెండో రోజు 4.55 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. సోమవారం రోజు ఇరవై లక్షల వరకు నా సామిరంగ కలెక్షన్స్ పెరిగాయి. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా నా సామిరంగ మూవీ 18.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఆది, సోమవారాల్లో కలిపి నాగార్జున మూవీకి 8.88 కోట్ల షేర్ వసూళ్లను దక్కించుకున్నది.
నైజాంలో హయ్యెస్ట్...
రెండో రోజు నాసామిరంగ మూవీ నైజాంలో వసూళ్ల పరంగా అదరగొట్టింది. పండుగ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్‌కు హెల్పయింది. సోమవారం రోజు నైజాం ఏరియాలో 1.47 కోట్ల వసూళ్లను రాబట్టింది. సీడెడ్‌లో 76 లక్షలు, వైజాగ్‌లో 57 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 54 లక్షలు, గుంటూరులో 41 లక్షల వసూళ్లను నా సామిరంగ రాబట్టింది.
వెస్ట్ గోదావరిలో 34 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు కలెక్షన్స్ పికప్ కావడంతో సినిమా యూనిట్ మరిన్ని ప్రమోషన్స్ చేయాలని ఫిక్సైనట్లు తెలిసింది. వరల్డ్ వైడ్‌గా 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టడానికి మరో పది కోట్ల దూరంలో ఉంది.
సైంధవ్...
నాగార్జున నా సామిరంగకు రెండో రోజు కలెక్షన్స్ పెరగ్గా...వెంకటేష్ సైంధవ్ మాత్రం రోజురోజుకు బాక్సాఫీస్ వద్ద డీలా పడుతోంది. మూడో రోజు ఈ సినిమా కలెక్షన్స్ భారీగా తగ్గాయి. వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లో ఈ మూవీ 9 కోట్ల గ్రాస్‌ను, నాలుగున్నర కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. సోమవారం రోజు సైంధవ్ మూవీకి రెండు కోట్ల యాభై లక్షలకుపైగా గ్రాస్, కోటి ఇరవై లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లో కలిసి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు మాత్రమే సైంధవ్ కలెక్షన్స్ రాబట్టింది. రోజురోజుకు వసూళ్లు తగ్గుతున్న నేపథ్యంలో సైంధవ్ బ్రేక్ ఈవెన్ కావడం అనుమానంగానే కనిపిస్తోంది. దాదాపు 25 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో ఇరవై కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. సినిమాపై ఉన్న నెగెటివ్ టాక్ కారణంగా అది అసాధ్యంగానే కనిపిస్తోంది.
పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్...
నా సామిరంగ స్నేహం, ప్రేమ అంశాలతో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ హీరోలుగా నటించారు. ఆషికా రంగనాథ్, రుక్సర్ థిల్లాన్, మిర్నా మీనన్ హీరోయిన్లుగా కనిపించారు.
ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మలయాళంలో విజయవంతమైన పురింజు మరియం జోస్ రీమేక్‌గా నా సామిరంగ మూవీ తెరకెక్కింది. మరోవైపు వెంకటేష్ సైంధవ్ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు యాక్షన్ అంశాలను జోడించి తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధాశ్రీనాథ్, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య కీలక పాత్రలు పోషించారు.