Ssmb28 OTT Rights: షూటింగ్ కంప్లీట్ కాకముందే అమ్ముడుపోయిన మహేష్ - త్రివిక్రమ్ మూవీ ఓటీటీ రైట్స్
Ssmb28 OTT Rights: మహేష్‌బాబు - త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న సినిమా షూటింగ్ పూర్తికాకముందే ఓటీటీ డీల్ పూర్తయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దక్కించుకున్నదంటే...
Ssmb28 OTT Rights: అతడు, ఖలేజా తర్వాత హీరో మహేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే ఓటీటీ డీల్ ముగిసింది. మహేష్ - త్రివిక్రమ్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది.
ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ తాము కొనుగోలు చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ శనివారం ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ స్ట్రీమింగ్ హక్కులను తామే తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మాత్రమే ఇప్పటివరకు పూర్తయింది.
అప్పుడే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. భారీ ధరకు మహేష్, త్రివిక్రమ్ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్‌లో ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు దర్శకుడు త్రివిక్రమ్.
ఆ తర్వాత కృష్ణ మరణించడంతో షూటింగ్ వాయిదాపడింది. ఈ నెలాఖరున సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏకధాటిగా మార్చి 30 వరకు షూటింగ్ జరుపబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
శ్రీలీల మరో హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మహేష్‌బాబు హీరోగా నటిస్తోన్న 28వ సినిమా ఇది. ఈ సినిమాకు ఎస్ఎస్ఎంబీ28 అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.