Mahesh Babu Trivikram Movie Release Date: మహేష్‌బాబు - త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ కన్ఫామ్
Mahesh Babu Trivikram Movie Release Date: మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాకు కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆ డేట్ ఏదంటే...
Mahesh Babu Trivikram Movie Release Date: మహేష్‌బాబు - త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ హ్యాట్రిక్ కాంబో సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు గతంలో నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ కృష్ణ హఠాన్మరణంతో చాలా రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ వాయిదాపడింది.
ఇప్పటివరకు కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తయింది. టార్గెట్ లోపు షూటింగ్ పూర్తికావడం కష్టం కావడంతో ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదని తెలిసింది. సినిమా రిలీజ్ దాదాపు నాలుగు నెలలు వాయిదా పడినట్లు సమాచారం. మరో కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఆగస్ట్ 11న మహేష్‌బాబు, త్రివిక్రమ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెబుతున్నారు.
త్వరలోనే ఈ కొత్త రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌లో మొదలుపెట్టబోతున్నట్లు చెబుతున్నారు.
ఇటీవలే ఫారిన్ టూర్‌ను ముగించుకొని ఇండియాకు వచ్చిన మహేష్‌బాబు వచ్చే బుధవారం ఎస్ఎస్ఎంబీ 28 సెట్స్‌లో అడుగుపెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ షెడ్యూల్‌లో మహేష్‌బాబు, పూజాహెగ్డేతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.
మార్చి 30 వరకు ఏకధాటిగా షూటింగ్‌ను జరుపనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో పూజాహెగ్డేతో పాటు శ్రీలీల మరో హీరోయిన్‌గా నటిస్తోంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న మూడో సినిమా ఇది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకొంది. ఈ సినిమా డిజిటల్‌రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని స్వయంగా నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.