Maa Awara Zindagi Movie Review: మా ఆవారా జిందగీ మూవీ రివ్యూ - బిగ్‌బాస్ శ్రీహాన్ మూవీ ఎలా ఉందంటే?
Maa Awara Zindagi Movie: బిగ్‌బాస్ శ్రీహాన్ హీరోగా నటించిన మా ఆవారా జిందగీ సినిమా ఈ శుక్రవారం (జూన్ 23న)న థియేటర్లలో విడుదలైంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే...
Maa Awara Zindagi Movie: యూత్‌ను టార్గెట్ చేస్తూ ప్రతివారం థియేటర్లతో పాటు ఓటీటీలో మూడు, నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. వీటిలో ఎక్కువభాగం ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ చేయడమే ప్రధాన ధ్యేయంగా తెరకెక్కుతోంటాయి. ఈ వారం థియేటర్లలో రిలీజైన మా అవారా జిందగీ అలాంటి సినిమానే.
బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 6తో పాపులర్ అయిన శ్రీహాన్ (Srihan) హీరోగా నటించిన ఈ సినిమాకు దేపా శ్రీకాంత్‌రెడ్డి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది? బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన శ్రీహాన్ మా ఆవారా జిందగీతో వెండితెరపై హిట్ అందుకున్నాడా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
కిడ్నాప్ డ్రామా...
భట్టి (శ్రీహాన్), సీబీ ( అజయ్), ఎల్బీ (చెర్రీ), లంబు (జస్వంత్) నలుగురు ప్రాణ స్నేహితులు. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలన్నది వారి సిద్ధాంతం. బీటెక్ పూర్తిచేసినా వారి తెలివితేటలకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరు. అమ్మయిల్ని టీజ్ చేస్తూ ఎస్సై రెడ్డి (షాయాజీ షిండే)కి నలుగురు స్నేహితులు టార్గెట్‌గా మారుతారు. అనూహ్యంగా ఎస్ఐ కూతురు కనిపించకుండా పోతుంది. ఆమెను సేవ్ చేయబోయి ఆ కిడ్నాప్ కేసులోనే భట్టి, సిబీ, ఎల్బీ, లంబు ఎలా చిక్కుకున్నారు? ఎస్ఐ కూతురిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ నేరం నుంచి స్నేహబృందం ఎలా బయటపడింది? అన్నదే మా ఆవారా జిందగీ)Maa Awara Zindagi Movie Review) కథ.
సింపుల్ స్టోరీ...
మా ఆవారా జిందగీని సింపుల్ స్టోరీతో తెరకెక్కించారు దర్శకుడు దేపా శ్రీకాంత్ రెడ్డి. కథ కంటే కామెడీ, అడల్ట్ కంటెంట్‌ను ఎక్కువగా నమ్ముకున్నాడు. ఈ జోనర్‌కు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఉన్నారు. వారిని టార్గెట్ చేస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఇంటిమేట్ సీన్స్‌తో ప్రారంభం నుంచి చివరి వరకు సినిమా నడుస్తుంది. వాటి నుంచే ఫన్‌ను జనరేట్ చేసే ప్రయత్నం చేశారు డైరెక్టర్.
నో లాజిక్స్...
నో లాజిక్స్ 100 పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ అని ట్యాగ్‌లైన్‌కు తగ్గట్లుగానే ఈ సినిమా సాగుతుంది. నవ్విస్తే చాలని దర్శకుడు ఫిక్స్ అయిపోయాడు. ఫస్ట్‌హాఫ్ మొత్తం నలుగురు స్నేహితులకు ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులు, ఉద్యోగాలు రాక అందరితో తిట్లు తినడం లాంటి సన్నివేశాలతో టైమ్‌పాస్ చేశారు. సెకండాఫ్‌లో ఓ కిడ్నాప్ డ్రామాను సెటప్ చేసి వారు ఇబ్బందుల్లో పడ్డట్లుగా చూపించారు.
చిన్న ట్విస్ట్...
ఆ సమస్యలో వారు ఇరుక్కువడం, అందులో నుంచి బయటపడే సీన్స్‌ను సీరియస్‌గా కాకుండా ఫన్‌వేలోనే నడిపించారు. చివరకు వారు ఎలా రియలైజ్ అయ్యారనే పాయింట్‌తో చిన్న ట్విస్ట్ ఇచ్చి ఎండ్ చేశారు. సెకండాఫ్‌లో ఎక్కువగా దర్శకుడు రొమాంటిక్ సీన్స్‌పైనే ఫోకస్ పెట్టాడు. తెలంగాణ యాసలో రాసిన కామెడీ డైలాగ్స్ నవ్వించాయి. రొటీన్ స్టోరీ ఈ సినిమాకు మైనస్‌గా మారింది. ఈ పాయింట్‌తో గతంలో చాలా సినిమాలొచ్చాయి. కామెడీ కొన్ని చోట్ల వర్కవుట్ కాలేదు.
నలుగురు స్నేహితులుగా...
నేటితరం కుర్రాళ్లకు ప్రతినిధులుగా కనిపించే పాత్రల్లో శ్రీహాన్, అజయ్, చెర్రీ, జస్వంత్ నటన బాగుంది శ్రీహాన్, అజయ్ కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్సయింది. ఎస్సై రెడ్డిగా షాయాజీ షిండే, విలన్‌గా టార్జాన్ ప్రాముఖ్యమున్న పాత్రల్లో కనిపించారు.
Maa Awara Zindagi Movie Review- టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్...
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా మా ఆవారా జిందగీ టైమ్‌పాస్ చేస్తూ చేస్తుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీస్ ఈ సినిమా చూడటం కొంత కష్టమే..
రేటింగ్ : 2.5/5