Kaliyugam Pattanamlo Review: కలియుగం పట్టణంలో రివ్యూ - తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?-kaliyugam pattanamlo review tollywood crime thriller movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kaliyugam Pattanamlo Review: కలియుగం పట్టణంలో రివ్యూ - తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Kaliyugam Pattanamlo Review: కలియుగం పట్టణంలో రివ్యూ - తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Mar 29, 2024 02:19 PM IST

Kaliyugam Pattanamlo Review: క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన క‌లియుగం ప‌ట్ట‌ణంలో మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో విశ్వ‌కార్తికేయ‌, ఆయుషిప‌టేల్‌, చిత్రాశుక్లా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

కలియుగం పట్టణంలో రివ్యూ
కలియుగం పట్టణంలో రివ్యూ

Kaliyugam Pattanamlo Review: విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం కలియుగం పట్టణంలో మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఈ సినిమాకు ర‌మాకాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

క‌వ‌ల సోద‌రుల క‌థ‌...

విజయ్ ( విశ్వ కార్తికేయ), సాగర్ ( విశ్వ కార్తికేయ) క‌వ‌ల పిల్ల‌లు. త‌ల్లిదండ్రులు మోహన్ (దేవీ ప్రసాద్), కల్పన (రూప లక్ష్మి) ల‌తో సంతోషంగా జీవిస్తుంటారు. విజ‌య్‌, సాగ‌ర్ భిన్న మ‌న‌స్త‌త్వాల‌తో పెరుగుతారు. విజయ్ రక్తం చూసి భయపడితే.. సాగర్ మాత్రం సైకోలా ఆనంద పడతాడు. సాగర్ బయట తిరిగితే ప్ర‌మాద‌మ‌ని భావించిన అత‌డి త‌ల్లిదండ్రులు చిన్న‌తంలోనే అత‌డిని ట్రీట్‌మెంట్ కోసం మెంట‌ల్‌ హాస్పిటల్ కి పంపిస్తారు.

పెరిగి పెద్ద‌యిన విజ‌య్ ఉన్న‌త చ‌దువుల కోసం కాలేజీలో జాయిన్ అవుతాడు. విజ‌య్ మంచిత‌నం చూసి శ్రావణి (ఆయుషి పటేల్) అత‌డిని ఇష్టపడుతుంది. నంద్యాలలో జ‌రుగుతున్న నేరాల‌కు అడ్డుక‌ట్ట‌వేయ‌డానికి కొత్త‌గా పోలీస్ ఆఫీస‌ర్‌ (చిత్రా శుక్లా) వస్తుంది? ఈ క్రైమ్‌ల వెనుక‌న్న షాకింగ్ నిజాల‌ను ఆమె ఎలా సాల్వ్ చేసింది. విజ‌య్‌.. సాగర్ లలో ఎవరు మంచి వారు.. ఎవరు చెడ్డ వారు.. నంద్యాల‌లో జ‌రుగుతోన్న నేరాల‌కు ఈ ఇద్ద‌రితో ఉన్న సంబంధం ఏమిటి? ఈ క‌వ‌ల‌ల జీవితాలు చివ‌ర‌కు ఎలాంటి మ‌లుపులు తిరిగాయి? అత్యాచారాల‌కు పాల్ప‌డుతోన్న వారిని చంపుతోన్న లేడీ కిల్ల‌ర్ ఎవ‌రు? అన్న‌దే క‌లియుగం ప‌ట్ట‌ణంలో మూవీ క‌థ‌.

క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ...

క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో ద‌ర్శ‌కుడు ర‌మాకాంత్ రెడ్డి ఈ మూవీని తెర‌కెక్కించాడు. నేరాల‌కు బీజం ఎక్క‌డ ప‌డుతుంది? పిల్ల‌ల‌ను స‌రిగ్గా పెంచ‌క‌పోతే వారు క్రిమిన‌ల్స్‌గా మారి సొసైటీకి ఎలాంటి క‌ష్టం క‌లిగిస్తున్నార‌నే సందేశానికి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు.

అంత‌ర్లీనంగా ఫ్యామిలీ ఎమోష‌న్స్ జోడించాడు. హీరో విల‌న్ ఇద్ద‌రు ఒకే పోలిక‌ల‌తో ఉండ‌టం అనే పాయింట్ ఆస‌క్తిని పంచుతుంది. క‌వ‌ల‌లో ఎవ‌రు హీరో...ఎవ‌రు విల‌న్ అనే ట్విస్ట్ చివ‌రి వ‌ర‌కు రివీల్ కాకుండా ద‌ర్శ‌కుడు ఈ సినిమాను న‌డిపించేందుకు ప్ర‌య‌త్నించాడు.

క్లైమాక్స్ ట్విస్ట్ ఒకే...

హీరో చైల్డ్ హుడ్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. ఆ త‌ర్వాత విశ్వ‌కార్తికేయ, ఆయుషి ప‌టేల్ ల‌వ్‌స్టోరీతో ఫ‌స్ట్ హాఫ్‌ను రొమాంటిక్‌గా న‌డిపించాడు డైరెక్ట‌ర్‌. న‌ల్ల‌మ‌ల ఫారెస్ట్ ఏరియాలో వ‌రుస‌గా క్రైమ్ జ‌ర‌గ‌డం, వాటి వెనుక ఎవరున్నార‌న్న‌ది క‌నిపెట్టేందుకు చిత్రా శుక్లా ఇన్వేస్టిగేష‌న్‌తో సెకండాఫ్ న‌డుస్తుంది. విజ‌య్, సాగ‌ర్‌ల‌లో ఒక‌రి బ‌దులుగా మ‌రికొరిని అనుమానిస్తూ సాగే డ్రామాతో క్లైమాక్స్ వ‌ర‌కు క‌థ‌ను న‌డిపించిన డైరెక్ట‌ర్ ఊహించ‌ని ట్విస్ట్‌తో ఎండ్ చేశాడు. ఫ‌స్ట్ హాఫ్‌లో చాలా వ‌ర‌కు ట్విస్ట్‌ల‌ను పెట్టిన డైరెక్ట‌ర్ సెకండాఫ్‌లో ఒక్కో చిక్కుముడిని విప్పుతూ వెళ్లాడు.

ఇన్వేస్టిగేష‌న్ మైన‌స్‌...

ఫ‌స్ట్ హాఫ్ చాలా స్లోగా సాగ‌డం ఈ సినిమాకు మైన‌స్‌గా అనిపిస్తుంది. చిత్రా శుక్లా ఇన్వేస్టిగేష‌న్ ఎపిసోడ్స్‌లో ఎలాంటి థ్రిల్స్ లేకుండా ఫ్లాట్‌గా సాగుతుంది.తాను అనుకున్న పాయింట్‌ను స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిన‌ట్లుగా అనిపించింది.

హీరో డ్యూయ‌ల్ రోల్‌...

ఈ సినిమాలో విశ్వ కార్తికేయ డ్యూయ‌ల్ రోల్ చేశాడు. విజయ్, సాగర్ పాత్రల్లో అత‌డు చూపించిన వేరియేషన్స్ ఒకే అనిపిస్తాయి. యాక్షన్ ఏమోషన్స్ సీన్స్‌లో బాగానే న‌టించాడు. పోలీస్ ఆఫీస‌ర్‌గా చిత్రా శుక్లా గ‌త సినిమాల‌కు భిన్నంగా క‌నిపించాడు. ఆయుషి పటేల్ యాక్టింగ్ పార్వ‌లేద‌నిపిస్తుంది.

న‌రేన్‌, దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్ల వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఒకే అనిపించారు.అజయ్ అర‌సాడ‌ పాటలు, అర్ అర్ సినిమాకి కొంత బ‌లంగా నిలిచాయి. స‌మ‌కాలీన సొసైటీలోని ఇష్యూస్‌ను చెబుతూ వ‌చ్చే డైలాగ్స్ అక్క‌డ‌క్క‌డ ఆలోచింప‌జేస్తాయి. క్రైమ్ మూవీ ల‌వ‌ర్స్‌ను క‌లియుగం ప‌ట్ట‌ణంలో కొంత వ‌ర‌కు మెప్పిస్తుంది.

రేటింగ్‌: 2.5/5

Whats_app_banner