Janhvi Kapoor Telugu Movie : మరో తెలుగు సినిమాలో జాన్వీ కపూర్.. హీరో ఎవరంటే?-janhvi kapoor signed another telugu movie with akhil akkineni directing by anil kumar details inside ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor Telugu Movie : మరో తెలుగు సినిమాలో జాన్వీ కపూర్.. హీరో ఎవరంటే?

Janhvi Kapoor Telugu Movie : మరో తెలుగు సినిమాలో జాన్వీ కపూర్.. హీరో ఎవరంటే?

Anand Sai HT Telugu
May 01, 2023 07:33 AM IST

Janhvi Kapoor In Telugu Movie : ఇప్పటికే ఒక తెలుగు సినిమాలో నటిస్తోంది బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. ఇప్పుడు మరో తెలుగు సినిమాను అంగీకరించినట్లు తెలుస్తోంది.

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్

సౌత్ ఇండియన్ సినిమాలు(South Indian Movies) బాలీవుడ్‌ను మించిన మార్కెట్‌ను సృష్టించుకుంటున్నాయి. దీంతో బాలీవుడ్ స్టార్స్(Bollywood Starts) ఇక్కడి సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. బాలీవుడ్‌లోని స్టార్ నటులు కూడా సౌత్ సినిమాల్లో భాగమయ్యేందుకు ఇంట్రస్ట్ గా ఉన్నారు.

మెుదట్లో దక్షిణాది సినిమాపై నిర్లక్ష్యం కనిపించేది.. కానీ కొన్ని సంవత్సరాలుగా కథ మారిపోయింది. పెద్ద మొత్తంలో పారితోషికం కోసం మాత్రమే దక్షిణాదికి వచ్చే నటీమణులు.. ఇప్పుడు మంచి పాత్రలు, గుర్తింపు పొందాలనే కోరికతో ఇటువైపు సినిమాలు చేస్తున్నారు. వారిలో జాన్వీ కపూర్(Janhvi Kapoor)ఒకరు.

శ్రీదేవి(Sri Devi) కూతురు.. జాన్వీ కపూర్ బాలీవుడ్ స్టార్ యువ నటి. గ్లామర్ పాత్రలతో పాటు ఛాలెంజింగ్ పాత్రల్లోనూ నటించేందుకు ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో తన మొదటి సినిమాలో నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో(NTR) కలిసి నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే జాన్వీ మరో తెలుగు సినిమా(Telugu Cinema) ఆఫర్‌ని అంగీకరించినట్లు సమాచారం.

అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరో వస్తున్న ఓ చిత్రంలో జాన్వీ కపూర్ నటించనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు జరిగాయని సమాచారం. ఈ చిత్రానికి యువ దర్శకుడు అనిల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ప్రభాస్ నటించిన సాహో సినిమాకు అనిల్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అఖిల్, జాన్వీకి దర్శకత్వం చేయనున్నాడు.

జాన్వీ కపూర్ తన మొదటి సౌత్ ఇండియన్ మూవీలో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం.. ఎన్టీఆర్ 30 చిత్రం(NTR 30). ఈ సినిమా కోసం జాన్వీ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంది. కేవలం కొన్ని రోజుల షూటింగ్ కోసం జాన్వీ 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

జాన్వీ తల్లి శ్రీదేవి కూడా బహుభాషా నటి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో నటించింది. ఇప్పుడు జాన్వీ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో రెండు సినిమాలతో పాటు హిందీలో కూడా జాన్వీ బిజీగా ఉంది. దీని తరువాత, తన తండ్రి బోనీ కపూర్ నిర్మించే తమిళ సినిమాలలో నటించే అవకాశం ఉంది.

IPL_Entry_Point