Trolls On Samantha: అప్పుడు ఎన్టీఆర్, చరణ్...ఇప్పుడు సమంత - ఫారిన్ యాసపై ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
Samantha Fake Accent: సిటాడెల్ లండన్ ప్రీమియర్‌లో సమంత ఫారిన్ స్లాంగ్‌లో మాట్లాడటంపై నెటిజన్లు ట్రోల్ చేస్తోన్నారు. ఫేక్ యాసలో మాట్లాడటం అవసరమా అంటూ విమర్శిస్తోన్నారు
Samantha Fake Accent: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌తో పాటు ఆస్కార్స్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన రామ్‌చరణ్, ఎన్టీఆర్ అక్కడి మీడియాతో అమెరికన్ స్లాంగ్‌లో మాట్లాడటంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఒరిజినల్ యాసను మార్చుకుంటూ హాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు కోసం అమెరికన్ స్టైల్‌లో మాట్లాడటంపై సోషల్ మీడియాలో ఇద్దరిపై చాలానే ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి.
తాజాగా సమంత కూడా ఈ ట్రోలింగ్ లిస్ట్‌లో చేరింది. సిటాడెల్ సిరీస్ లండన్ ప్రీమియర్‌కు ఇటీవల సమంత హాజరైంది. అక్కడి మీడియాతో సిటాడెల్ ఇండియన్ టీమ్ ముచ్చటించింది. డైరెక్టర్స్, హీరో వరుణ్‌ధావన్ ఇండియన్ స్లాంగ్‌లోనే ముచ్చటించగా సమంత మాత్రం తన ఒరిజినల్ ఇంగ్లీష్ స్లాంగ్‌లో కాకుండా ఫారిన్ యాసలో మాట్లాడింది.
ఆమె మాట్లాడిన తీరుపైనెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఈ ఫేక్ యాస అవసరమా అంటూసోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తోన్నారు. ఫారిన్ స్లాంగ్ సమంతకు సూట్ కాలేదని మరో నెటిజన్ పేర్కొన్నాడు. తనది కేరళ అని ఎవరైనా గుర్తు చేయండి అంటూ మరో నెటిజన్ ఫన్నీగా పేర్కొన్నాడు.
ఈ ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలోవైరల్ అవుతోన్నాయి. కాగా సిటాడెల్ అమెరికన్ సిరీస్‌లో ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నారు. ఏప్రిల్ 28న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.
ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్‌లో సమంత, వరుణ్‌ధావన్ ప్రధాన పాత్రలను పోషిస్తోన్నారు. సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌కు రాజ్‌డీకే దర్శకత్వం వహిస్తోన్నారు. ఈ సిరీస్ ప్రీమియర్‌తో పాటు షూటింగ్ కోసం ఇటీవలే లండన్ వెళ్లింది సమంత. సిటాడెల్ సిరీస్ తో పాటు ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తోంది సమంత.