Boycott Laal Singh Chaddha: ఆమిర్‌ఖాన్‌పై తీవ్రంగా మండిపడిన ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌-former england spinner monty panesar calling for boycott laal singh chaddha for this reason ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Boycott Laal Singh Chaddha: ఆమిర్‌ఖాన్‌పై తీవ్రంగా మండిపడిన ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌

Boycott Laal Singh Chaddha: ఆమిర్‌ఖాన్‌పై తీవ్రంగా మండిపడిన ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌

Hari Prasad S HT Telugu
Aug 12, 2022 04:39 PM IST

Boycott Laal Singh Chaddha: ఆమిర్ ఖాన్‌ నటించిన లాల్‌ సింగ్‌ చడ్డాపై తీవ్రంగా మండిపడ్డాడు ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌. ఈ మూవీలో ఇండియన్‌ ఆర్మీని, సిక్కులను అవమానించారంటూ సినిమా బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చాడు.

<p>మాంటీ పనేసర్, లాల్ సింగ్ చడ్డా మూవీలో ఆమిర్ ఖాన్</p>
మాంటీ పనేసర్, లాల్ సింగ్ చడ్డా మూవీలో ఆమిర్ ఖాన్ (File photo)

ఓవైపు ఇండియాలో బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా ప్రతి రోజూ ట్విటర్‌ టాప్‌ ట్రెండింగ్స్‌లో ఒకటిగా నిలుస్తూనే ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ కూడా అక్కడ ఈ మూవీని బాయ్‌కాట్‌ చేయాలని పిలుపునిస్తున్నాడు. అంతేకాదు ఆమిర్‌ఖాన్‌పై తీవ్రంగా మండిపడ్డాడు. ఈ సినిమాలో ఇండియన్‌ ఆర్మీని, సిక్కులను ఆమిర్ అవమానించాడని అతడు ఫైరయ్యాడు.

పంజాబ్‌ మూలాలు కలిగి ఉన్న మాంటీ పనేసర్‌ ట్విటర్‌ ద్వారా తన ఆగ్రహాన్ని వెల్లగక్కాడు. ఓ మందబుద్ధి కలిగిన వ్యక్తి ఆర్మీకి సేవలందించి, అవార్డు అందుకునే స్థాయికి ఎలా ఎదిగాడన్నది ఈ మూవీ కథాంశం. హాలీవుడ్ సినిమా ఫారెస్ట్‌ గంప్‌ రీమేక్‌గా వచ్చింది. అయితే ఫారెస్ట్‌ గంప్‌ స్టోకీ యూఎస్‌కు సూటవుతుందేమోకానీ.. ఇండియన్‌ ఆర్మీకి ఎలా అవుతుందని పనేసర్‌ ప్రశ్నించాడు.

"వియత్నాం యుద్ధం సందర్భంగా తమ ఆర్మీ బలాన్ని పెంచుకోవడానికి అమెరికా అప్పట్లో మందబుద్ధి కలిగిన వాళ్లను కూడా ఆర్మీలోకి తీసుకుంది కాబట్టి ఫారెస్ట్‌ గంప్‌ అక్కడి పరిస్థితులకు సూటవుతుంది. కానీ లాల్‌ సింగ్‌ చడ్డా భారత సాయుధ బలగాలను అవమానించింది. ఇండియన్‌ ఆర్మీని, సిక్కులను అగౌరవపరిచింది, అవమానించింది" అని పనేసర్‌ ఓ ట్వీట్‌లో అన్నాడు.

ఇక మరో ట్వీట్‌లో ఇండియన్‌ ఆర్మీలో సేవలందించిన సిక్కులకు వచ్చిన అవార్డుల గురించి పనేసర్‌ చెప్పాడు. ఒక పద్మ విభూషణ్‌, ఒక పద్మ భూషణ్‌, 21 ఇండియన్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్స్‌, 14 విక్టోరియా క్రాసెస్‌, 2 పరమ్‌ వీర్‌ చక్రలు, 4 అశోక చక్రలు, 8 మహావీర చక్రలు, 24 కీర్తి చక్రలు, 64 వీర్‌ చక్రలు, 55 శౌర్య చక్రలు, 375 సేనా మెడల్స్‌ ఆర్మీలో పని చేసిన సిక్కులకు వచ్చినట్లు పనేసర్‌ తెలిపాడు.

లాల్‌ సింగ్‌ చడ్డాలో ఆమిర్‌ ఓ మూర్ఖుడి క్యారెక్టర్‌ చేశాడని, ఫారెస్ట్‌ గంప్‌ కూడా మూర్ఖుడే అని.. ఇది అగౌరవపరచడం, అవమానించడమే అని పనేసర్‌ మరో ట్వీట్‌లో మండిపడ్డాడు. బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్ చడ్డా అంటూ పిలుపునిచ్చాడు. బాయ్‌కాట్‌ పిలుపా లేక మరేదైనా కారణమో తెలియదు కానీ.. ఈ సినిమా తొలి రోజు వసూళ్లు దారుణంగా ఉన్నాయి. దేశం మొత్తం కేవలం 15 నుంచి 20 శాతం ఆక్యుపెన్సీతో కేవలం రూ.11 కోట్లు మాత్రమే రాబట్టింది.

Whats_app_banner