Bollywood: బాలీవుడ్‌లో అంతా రాక్షసులే ఉన్నారని చెప్పారు.. నటి సంచలన వ్యాఖ్యలు-bollywood actress kubbra sait says people told her bollywood is full of demons and monsters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bollywood: బాలీవుడ్‌లో అంతా రాక్షసులే ఉన్నారని చెప్పారు.. నటి సంచలన వ్యాఖ్యలు

Bollywood: బాలీవుడ్‌లో అంతా రాక్షసులే ఉన్నారని చెప్పారు.. నటి సంచలన వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Jul 09, 2022 07:19 AM IST

బాలీవుడ్ నటి కుబ్రా సెయిట్ హిందీ చిత్రసీమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడకు వచ్చినప్పుడు తనకు కొంతమంది చిత్రసీమ గురించి చెడుగా చెప్పారని గుర్తు చేసుకుంది. కానీ ఇది చాలా గొప్ప ప్రదేశమని తనకు తర్వాత అర్థమైందని తెలిపింది.

బాలీవుడ్ నటి కుబ్రా సెయిట్
బాలీవుడ్ నటి కుబ్రా సెయిట్ (Nitin Lawate)

చిత్రసీమలో అడుగుపెట్టాలనేది ఎంతోమంది కల. అయితే ఆ రంగుల ప్రపంచం వెనుక ఎన్నో చీకటి కోణాలు. వాటన్నింటికి ఎదురొడ్డి నిలుచున్న వారే విజయతీరాలను చేరుకుంటారు. తెరపై తమను చూసుకోవాలని కల నెరవేర్చుకోవడం కోసం చాలా మంది త్యాగాలు చేస్తారు. అయితే కొంతమంది ఆ అదృష్టం వరిస్తుంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి కుబ్రా సెయిట్ హిందీ చిత్ర సీమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తను చిత్రసీమలో అడుగుపెట్టే ముందు కొంతమంది ఇక్కడ గురించి చెడుగా చెప్పారని, బాలీవుడ్ అంతా దెయ్యాలు, రాక్షసులే ఉన్నాయని చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె గుర్తు చేసుకున్నారు.

"చిత్రసీమకు నేను వచ్చినప్పుడు కొంతమంది ఇక్కడ గురించి చాలా చెడుగా చెప్పారు. ఇది అత్యంత చెత్త ప్రదేశమని, బ్యాగ్ సర్దుకుని ఇక్కడ నుంచి వెళ్లిపోతే మంచిదని అన్నారు. కానీ ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఇది ఎంతో పవిత్రమైన వృత్తి అని అర్థమైంది. ఇంతకంటే ఉన్నతమైన వృత్తి లేదని తెలుసుకున్నాను. ఈ వృత్తి కథలు చెప్పడానికి, ఇతరుల జీవితాల్లో జీవించడానికి అనుమతిస్తుంది. మీరు ఉండగలిగే అత్యంత సౌకర్యవంతమైన ప్రదేశం ఇది. ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకనే గొప్ప ప్రదేశం అని నేను భావిస్తున్నాను" అని ఆమె అన్నారు.

"నేను చిత్రసీమకు వచ్చినప్పుడు ఇక్కడ అంతా రాక్షసులు, దెయ్యాలే ఉన్నారని చెప్పారు. కానీ నేను వాటిని పట్టించుకోకుండా నా కలల కోసం ఇక్కడకు వచ్చాను. ఏదేమైనప్పటికీ ఆ మాటలు పీడకలలా అనిపిస్తే.. ప్రయాణంలో ముందుకు సాగిపోవడమే మనం చేయాలి. క్షమించడానికి చాలా భాగముంది. కానీ దుర్మార్గులు ఏం చేస్తారో వారు అది చేసే తీరతారు. మీరు వారి కంటే ఉన్నతస్థాయిలో ఉంటే వారితో పోరాడే ఇంకా అవకాశముంది." అని కుబ్రా సెయిట్ స్పష్టం చేశారు,

బెంగళూరులో జన్మించిన కుబ్రా.. సల్మాన్ ఖాన్ నటించిన రెడీ చిత్రంలో చిన్న పాత్రతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. అనంతరం సుల్తాన్, రెడీ, జవానీ జానేమన్, డోలీ కిట్టి ఔర్ వో చమక్తే సితారే, సిటీ ఆఫ్ లైఫ్ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే అన్నింటికంటే ఆమెకు నెట్‌ఫ్లిక్స్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్ బాగా గుర్తింపు తీసుకొచ్చింది. ఆమె చివరిగా యాపిల్ టీవీ ప్లస్ సిరీస్ ఫౌండేషన్‌లో కనిపించింది. ఇటీవలే ఈ నటి తన మొదటి పుస్తకాన్ని ఆవిష్కరించింది. జూన్ 27న తను రాసిన ఓపెన్ బుక్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ఈ బుక్‌లో తను ఏ విధంగా కుటుంబ సభ్యులు, స్నేహితులచేత లైంగికంగా హింసకు గురైందో కథల రూపంలో పంచుకుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్