Bigg Boss OTT | సీక్రెట్ రూంలో అరియానా.. అఖిల్ ఫేక్.. అనిల్ వరస్ట్ కెప్టెన్-bigg boss non stop telugu march 16 episode updates ariyana has secret task ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Ott | సీక్రెట్ రూంలో అరియానా.. అఖిల్ ఫేక్.. అనిల్ వరస్ట్ కెప్టెన్

Bigg Boss OTT | సీక్రెట్ రూంలో అరియానా.. అఖిల్ ఫేక్.. అనిల్ వరస్ట్ కెప్టెన్

Maragani Govardhan HT Telugu
Mar 17, 2022 03:09 PM IST

బిగ్‌బాస్ నాన్ స్టాప్ 17వ రోజు ఆట రసవత్తరంగా సాగింది. యాంకర్ శివతో పాటు అరియానాకు కూడా బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్‌లు ఇస్తారు. అంతేకాకుండా అఖిల్‌కు ఫేక్ అని ఓట్ చేయడంతో అతడు బాగా ఫీల్ అవుతాడు.

<p>అరియానాకు సీక్రెట్ టాస్క్&nbsp;</p>
అరియానాకు సీక్రెట్ టాస్క్ (Youtube)

ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. బిగ్ బాస్ షోలో 17వ రోజు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం యాంకర్ శివకు సీక్రెట్ టాస్క్ ఇవ్వడంతో అతడు ఎవ్వరికీ అనుమానం రాకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. మరోవైపు అనిల్ కెప్టెన్సీ గురించి బిగ్‌బాస్ హౌస్ మెంబర్స్‌కు దిమ్మదిరిగే షాక్ ఇస్తాడు. అంతేకాకుండా అరియానా గ్లోరీని కన్ఫెషన్ రూంకు రమ్మని పిలిచి మరో సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. ఫేక్ పొగడ్తల టాస్క్‌లో అఖిల్-బిందు మధ్య జరిగిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఈ విధంగా బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో చాలా ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.

ముందుగా ఆల్రెడీ యాంకర్ శివకు సీక్రెట్ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్.. అరియానాను కూడా కన్ఫెషన్ రూంకు పిలుస్తారు. అంతా మీ ఇష్టం టాస్క్‌లో భాగంగా హౌస్‌లో ఒకరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చామని, ఆ టాస్క్ ప్రకారం ఇంటి సభ్యులు నిర్ణయాలు కాకుండా.. ఆ ఒక్కరి నిర్ణయాలకు అనుగుణంగా టాస్క్ జరుగుతుందని చెబుతారు. ఆ వ్యక్తి ఎవరో గెస్ చేయాలని అడగ్గా.. అరియానా ఏమాత్రం ఆలోచించకుండా యాంకర్ శివ చెప్పేసింది. దీంతో అరియానాకు కూడా మరో సీక్రెట్ టాస్ ఇస్తారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం యాంకర్ శివను ఇంటి సభ్యులెవ్వరూ పట్టుపడకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ ప్రక్రియలో శివ పట్టుబడితే అతనితో పాటు మీరు కూడా కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశాన్ని కోల్పోతారని చెబుతారు. కావాలనుకుంటే తన సీక్రెట్ టాస్క్ విషయాన్ని శివతో పంచుకోవచ్చని చెబుతారు. అయితే అవరం వచ్చినప్పుడే చెబుతానని అరియాని బదులిస్తుంది.

అరియానా కన్పెషన్ రూమ్‌కు వెళ్లిన తర్వాత ఆమెకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారని ఇంటి సభ్యులు మొదట్లోనే పసిగడతారు. అంతేకాకుండా ఆమె కిచెన్‌లో కావాలనే ఆయిల్‌ను కింద పడేయటంతో సీక్రెట్ టాస్క్ ఉందని కన్ఫార్మ్ చేసుకుంటారు.

ఫేక్ పొగడ్తలు..

మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా.. బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు నిజం కానీ పొగడ్తలతో ముంచెత్తాలని.. అరియనా ఎవరి పేరు చెప్తే వాళ్లు వచ్చి ప్రశంసలు కురిపంచాల్సి ఉంటుందని చెబుతారు. దీంతో మొదటిగా అరియానా.. అఖిల్-ఆర్జే చైతును పిలుస్తుంది. ఆ తర్వాత తేజస్వీ, నటరాజ్ మాస్టార్‌ను పిలుస్తుంది. ఇలా ఒకరి తర్వాత ఒకరిని జంటలుగా పిలవడంతో టాస్క్ ఫన్నీగా సాగుతుంది. అయితే అఖిల్-బిందు మాధవి మధ్య జరిగి ఫేక్ పొగడ్తలు మాత్రం ఈ ఎపిసోడ్‌కే హైలెట్‌గా నిలుస్తాయి. అఖిల్‌ను పొగడాలని బిందుకు చెప్పడంతోనాకు నాకు డ్రీమ్ వచ్చిందని, అందులో ఫుల్ రొమాన్స్ జరిగిందని, హౌస్ లో నువ్వే బెస్ట్ అని.. ఫేక్ పొగడ్తలతో అఖిల్‌ను మునగచెట్టుపై కూర్చొపెడుతుంది. అయితే బిందు పొగడ్తలు తనకు జెన్యూన్‌గా అనిపించాయని, అందుకే ఆమెకు హగ్ ఇచ్చినట్లు సర్దిచెప్పుకుంటాడు అఖిల్.

షాక్ అనిల్‌కా.. ఇంటి సభ్యులకా..

ప్రోమో చూసినవారెవ్వరైనా అనిల్‌కు బిగ్ బాస్ షాకిచ్చారని అనుకుంటారు. ఎందుకంటే అతడిని కెప్టెన్సీ నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అయితే ఎపిసోడ్‌లో వచ్చేసరికి అనిల్ కెప్టెన్సీ ఎలా ఉందని హౌస్ మెంబర్లను బిగ్ బాస్ అడుగుతారు. అయితే అందరూ బాగుంది.. గుడ్ అని సమాధానం చెబుతారు. దీంతో అతడి కెప్టెన్సీలో కొన్ని హైలెట్లు చూపిస్తానంటూ.. ఇంటి సభ్యులు నిద్రించడం, మైక్ పెట్టుకోకుండా తిరగడం లాంటి దృశ్యాలను చూపిస్తారు. ఈ దృశ్యాలను చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటని, అనిల్ బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్‌గా బాగా చేశాడా లేదా అని తిరిగి ప్రశ్నిస్తాడు. ఒకవేళ బాగా చేస్తే అతడికి రెండు వారాల పాటు డైరెక్టుగా కెప్టెన్సీ కంటెండర్‌గా అవకాశం లభిస్తుందని, లేదంటే రెండు వారాల పాటు కెప్టెన్సీకి అవకాశం వచ్చినా పోటీ చేసేందుకు అతడు అనర్హుడవుతాడని షరతు పెడతారు.

అనిల్ కెప్టెన్‌గా ఫెయిల్ అయ్యాడంచే.. తమ వల్లేనని తాము పడుకోవడం వల్లే బిగ్ బాస్ శిక్ష విధించారని ఇంటి సభ్యులు నిర్ణయానికి రావడంతో అతడిని కెప్టెన్‌గా విజయవంతం అయ్యాడని హౌస్‌లో ఉన్న 9 మంది సభ్యులు చేతులు ఎత్తారు. దీంతో బిగ్ బాస్ వచ్చే రెండు వారాలు అనిల్‌ను డైరెక్టుగా కెప్టెన్ పోటీదారుడు అవుతారని ప్రకటిస్తారు. అంతేకాకుండా ఇంటి రూల్స్ పాటించినందుకు అనిల్‌ను తక్షణమే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నానని పేర్కొంటూ చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. ఇందుకు అనిల్ పెద్దగా ఏం ఫీల్ కాలేదు. కానీ కెప్టెన్ పోటీదారులుగా డైరెక్ట్‌గా ఎలా నామినేట్ చేస్తారు? మనకు అవకాశం వచ్చినప్పుడు కూడా సరిగ్గా ఆలోచించకపోతే ఎలా? అంటూ తేజస్వి, మహేశ్ విట్టా, సరయు, హమీదా విభేదిస్తారు.

అఖిల్, నటరాజ్ ఫేక్..

అయితే అంతా మీ ఇష్టం టాస్క్‌లో భాగంగా తర్వాత ఓటింగ్ ప్రక్రియంలో ఇంట్లో ఎవరు ఫేక్, ఎవరు చికాకు పెట్టిస్తున్నారని ఇంటి సభ్యులు ఎంచుకోవాలని బ్యాలెట్ బాక్స్‌ను పంపుతాడు. అయితే అందులో అందరూ వివిధ రకాల పేర్లు రాస్తారు. కానీ యాంకర్ శివకు వచ్చి సీక్రెట్ పవర్ కారణంగా ఇంటి సభ్యులు నిర్ణయాలు కాకుండా అతడు సూచించిన అఖిల్, నటరాజ్ మాస్టార్‌ను ఫేక్‌గా బిగ్ బాస్ ప్రకటిస్తారు. అంతేకాకుండా వారి మెడలో 'ఐయామ్ ఫేక్' అని రాసి ఉన్న మెడల్స్‌ను కూడా వేయాలని సూచిస్తారు. దీంతో వారిద్దరూ ఆ మెడల్స్‌ను ధరిస్తారు. అఖిల్ పేరును ప్రకటించగానే అషూరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. హౌస్‌లో ఇద్దరు, ముగ్గురు అఖిల్‌కు వెసి ఉంటారని తమ క్యాలిక్యులేషన్‌లు వేసుకుంటారు అషూ, స్రవంతి. యాంకర్ శివ, బిందు, ఆర్జే చైతూ వేసి ఉంటారని అంచనా వేస్తారు. అయితే ఈ విషయాన్నే బిందు ముందుగానే పసిగడుతుంది. వారు అఖిల్‌కు నేను వేశానని అనుకుంటారని.. నిజానికి అతడికి నేను ఓట్ చేయలేదని యాంకర్ శివతో చెబుతుంది. ఏదిఏమైనా తన పేరును ఫేక్‌ అని సూచించడంపై మనల అలక రాజు అఖిల్‌ బాగానే హర్ట్ అయ్యాడు.

Whats_app_banner

సంబంధిత కథనం