Anupama Parameswaran | అనుపమను భయపెట్టిన ‘బటర్ ఫ్లై’
అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘బటర్ ఫ్లై’. గంటా సతీష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ గురువారం విడుదలైంది.
‘అఆ’ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. శతమానంభవతి, రాక్షసుడు, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలతో సక్సెస్‌లను అందుకొంది. గ్లామర్ హంగులతో కూడిన పాత్రలకు దూరంగా ఉంటూ అచ్చ తెలుగు అమ్మాయిగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేయలేకపోయినా ఈ అమ్మడి ఫాలోయింగ్ మాత్రం తెలుగులో భారీగానే ఉంది. కెరీర్‌లో తొలిసారి లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో ఆమె చేస్తున్న చిత్రం ‘బటర్ ఫ్లై’ ఈ సినిమా టీజర్ గురువారం విడుదలైంది. డైలాగ్స్ లేకుండా సస్పెన్స్ అంశాలతో టీజర్ ను కట్ చేశారు. అపార్ట్‌మెంట్‌లో దేని గురించో వెతుకుతూ భయభయంగా అనుపమ పరమేశ్వరన్ ఈ టీజర్ లో కనిపిస్తోంది. డోంట్ బిలీవ్ యువర్ ఐస్, బ్రైన్ అనే క్యాప్షన్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీజర్ కు యూట్యూబ్‌లో చక్కటి స్పందన లభిస్తోంది. కెరీర్ లో ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లోనే నటించింది అనుపమ. తన శైలికి భిన్నంగా సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఆమె చేస్తున్న సినిమా ఇది. గంటా సతీష్ బాబు దర్శకత్వంలో రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియోన్స్‌ను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రస్తుతం ‘బటర్‌ఫ్లై’ తో పాటు తెలుగులో ‘కార్తికేయ-2’, ‘18 పేజీస్’ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది అనుపమ పరమేశ్వరన్.