Vimanam OTT Release Date: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న విమానం - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే-anasuya samuthirakani vimanam movie to stream on zee5 ott from june 30 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vimanam Ott Release Date: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న విమానం - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Vimanam OTT Release Date: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న విమానం - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

HT Telugu Desk HT Telugu
Jun 27, 2023 06:27 AM IST

Vimanam OTT Release Date: స‌ముద్ర‌ఖ‌ని, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విమానం మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ ఎమోష‌న‌ల్ డ్రామా మూవీ ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే...

విమానం మూవీ
విమానం మూవీ

Vimanam OTT Release Date: విమానం మూవీ ఈ నెలాఖ‌రున ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జూన్ 30 నుంచి జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో అదే రోజు జీ5 ఓటీటీలో (Zee5 OTT) ఈ మూవీ రిలీజ్ అవుతోంది. భిన్న వ్య‌క్తుల జీవితాల నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ డ్రామాగా ద‌ర్శ‌కుడు శివ ప్ర‌సాద్ యానాల విమానం సినిమాను తెర‌కెక్కించాడు.

ఇందులో స‌ముద్ర‌ఖ‌ని, అన‌సూయ‌భ‌ర‌ద్వాజ్(Anasuya), రాహుల్ రామ‌కృష్ణ‌, మీరా జాస్మిన్ (Meera Jasmine) కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జూన్ 9న థియేట‌ర్ల‌లో రిలీజైన విమానం మంచి సినిమాగా ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిల‌వ‌లేక‌పోయింది. అందువ‌ల్లే ఈ సినిమా ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

విమానం సినిమాలో వీర‌య్య అనే అవిటిత‌నంతో బాధ‌ప‌డే వ్య‌క్తిగా స‌ముద్ర‌ఖ‌ని న‌టించాడు. విమానం ఎక్కాల‌నే త‌న కొడుకు క‌ల‌ను వీర‌య్య ఎలా నెర‌వేర్చాడ‌న్న‌ది స‌ముద్ర‌ఖ‌ని పాత్ర ద్వారా ఎమోష‌న‌ల్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశారు డైరెక్ట‌ర్‌. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ కోసం ప‌రిత‌పించే సుమ‌తి అనే మ‌హిళ పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ క‌నిపించింది.

విమానం సినిమాతోనే శివ ప్ర‌సాద్ యానాల డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యాడు. అలాగే సుదీర్ఘ విరామం అనంత‌రం ఈ మూవీతోనే మీరా జాస్మిన్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది జీ స్టూడియోస్‌తో క‌లిసి కిర‌ణ్ కొర్ర‌పాటి విమానం సినిమాను నిర్మించారు.

ఓ వైపు న‌టుడిగా బిజీగా ఉంటూనే ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోలుగా న‌టిస్తోన్న‌ బ్రో సినిమాకు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ జూలై 28న రిలీజ్ కానుంది. అన‌సూయ కూడా పుష్ప‌-2తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ బిజీగా ఉంది.

IPL_Entry_Point