Allu Arjun Pushpa 2: పుష్ప-2 షూటింగ్ షురూ - సినిమాటోగ్రాఫర్‌తో బన్నీ ఫొటో వైరల్
Allu Arjun Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప -2 సినిమా షూటింగ్‌ను సైలెంట్‌గా మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. . ఆదివారం బన్నీతో కలిసి సినిమాటోగ్రాఫర్ మిరోస్లా క్యూబా బ్రోజెక్ దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Allu Arjun Pushpa 2: పుష్ప -2 షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలుకానుందా అని చాలా రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా షూటింగ్ ప్రారంభంపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఆగస్ట్ నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సినిమా లాంఛ్ అయ్యి రెండు నెలలు గడిచినా షూటింగ్ మాత్రం మొదలుకాకపోవడం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
ఎట్టకేలకు ఆదివారం నుంచి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం పుష్ప సినిమాటోగ్రాఫర్ మిరోస్లా క్యూబా బ్రోజెక్ పోస్ట్ చేసిన ఫొటో చూస్తుంటే సినిమా షూటింగ్ మొదలైంది నిజమేనని తెలుస్తోంది. అడ్వెంచర్ హాజ్ బిగెన్ అంటూ అల్లు అర్జున్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను మిరోస్లా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో బన్నీపై ఫ్రేమ్ సెట్ చేస్తూ మిరోస్లా కనిపిస్తున్నాడు. థాంక్స్ టూ ఐకాన్ స్టార్ అంటూ మిరోస్లా ఈ ఫొటోకు క్యాప్షన్ జోడించాడు.
ఈ ఫొటోలో స్టైలిష్‌లుక్‌లో బన్నీ కనిపిస్తున్నాడు. గత ఏడాది విడుదలైన పుష్ఫ పార్ట్ 1 సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో అద్భుతమైన వసూళ్లను సొంతం చేసుకొని అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో అల్లు అర్జున్ మేనరిజమ్స్‌తో పాటు తగ్గేదేలే అనే డైలాగ్ పాపులర్ అయ్యింది. దాంతో ఈ సీక్వెల్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సీక్వెల్‌లో సిండికేట్ నాయకుడిగా పుష్పరాజ్ ప్రయాణంతో పాటు అతడి ఫ్యామిలీ జర్నీని దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించబోతున్నారు. పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కున్న ఈ సీక్వెల్‌లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.