Tollywood | విజయ్ దేవరకొండ-సమంత సినిమాకు ఆ సూపర్ హిట్ చిత్రం టైటిల్!-according to reports vijay devarakonda and samantha new movie title is kushi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  According To Reports Vijay Devarakonda And Samantha New Movie Title Is Kushi

Tollywood | విజయ్ దేవరకొండ-సమంత సినిమాకు ఆ సూపర్ హిట్ చిత్రం టైటిల్!

విజయ్ దేవరకొండ-సమంత చిత్రం
విజయ్ దేవరకొండ-సమంత చిత్రం (Twitter)

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం టైటిల్‌పై ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఓ సూపర్ హిట్ చిత్రం పేరును దీనికి పెట్టినట్లు సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ కశ్మీర్ లోయలో శరవేగంగా జరుగుతోంది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ కెరీర్‍‌లో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్, జేజీఎం లాంటి సినిమాలు చేస్తున్న విజయ్.. ఇటీవలే శివ నిర్వాణతో ఓ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 21న ప్రారంభమైంది. ఇందులో సమంత హీరోయిన్‌గా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

విజయ్ దేవరకొండ, సమంత హీరో,హీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమా పేరు ఖుషీ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2001లో వచ్చిన పవన్‌కల్యాణ్, భూమిక నటించిన ఖుషీ టైటిల్‌ను ఈ సినిమాకు వాడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కూడా రొమాంటిక్ కామెడీనే కావడం మరో విశేషం. అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మే 09న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజున బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలని ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకులను కట్టిపడేయాలని చిత్రబృందం అనుకుంటుందట. ఇందుకోసం దర్శకుడు శివ నిర్వాణ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్డేట్ వెలువడనుంది.

ప్రస్తుతం కశ్మీర్ లోయలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సమంత, విజయ్ తొలిసారి జోడీ కడుతున్నారు. వీరిద్దరిపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. మల్టీపుల్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారట మూవీ మేకర్స్. కశ్మీర్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్, వైజాగ్, అలెప్పీ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా సెట్‌లో విజయ్ దేవరకొండ, అతడి బృందం సామ్‌కు వినూత్న రీతిలో విషెస్ చెప్పారు.

సంబంధిత కథనం

టాపిక్