Fans on World Cup Team: ఇక మీరు వేరే దేశాలకు ఆడుకోండి.. చహల్, సంజూలకు ఫ్యాన్స్ సూచన-play for other countries fans after sanju and chahal dropped from world cup team ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Fans On World Cup Team: ఇక మీరు వేరే దేశాలకు ఆడుకోండి.. చహల్, సంజూలకు ఫ్యాన్స్ సూచన

Fans on World Cup Team: ఇక మీరు వేరే దేశాలకు ఆడుకోండి.. చహల్, సంజూలకు ఫ్యాన్స్ సూచన

Hari Prasad S HT Telugu
Sep 05, 2023 05:35 PM IST

Fans on World Cup Team: ఇక మీరు వేరే దేశాలకు ఆడుకోండి అంటూ చహల్, సంజూలకు ఫ్యాన్స్ సూచించడం విశేషం. వరల్డ్ కప్ జట్టులో ఈ ఇద్దరికీ చోటు దక్కకపోవడంపై పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంజూ శాంసన్
సంజూ శాంసన్ (PTI)

Fans on World Cup Team: వరల్డ్ కప్ 2023 కోసం మంగళవారం (సెప్టెంబర్ 5) ఇండియన్ టీమ్ ను ఎంపిక చేశారు. ఇదే బెస్ట్ టీమ్ అని కెప్టెన్ రోహిత్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెబుతున్నా.. ఫ్యాన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంజూ శాంసన్, యుజువేంద్ర చహల్ లకు చోటు దక్కకపోవడంపై వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక మీరు వేరే దేశాలకు ఆడుకోండని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ సంజూ శాంసన్, చహల్ లకు సూచించడం గమనార్హం. ప్రస్తుతం ఆసియా కప్ లో రిజర్వ్ ప్లేయర్ గా ఉన్న సంజూకు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. అటు చహల్ ను ఆసియా కప్ లాగే వరల్డ్ కప్ కు కూడా సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ ఇద్దరికీ ఎప్పుడూ అన్యాయం జరుగుతోందని అభిమానులు అంటున్నారు.

అదే సమయంలో అసలు వన్డేల్లో ఫామ్ లో లేని సూర్యకుమార్ ను తీసుకోవడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నీకు అసలు వరల్డ్ కప్ టీమ్ లో ఉండే అర్హత లేదు.. నీకు నువ్వుగా తప్పుకో అని ఓ అభిమాని ట్వీట్ చేయడం విశేషం. సంజూని కాదని సూర్యను ఎంపిక చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎంపిక చేయకపోయినా నిన్ను నువ్వు నిరూపించుకుంటూనే ఉండు అంటూ సంజూని ఫ్యాన్స్ ప్రోత్సహిస్తున్నారు.

ఇక చహల్ లాంటి మ్యాచ్ విన్నర్ కు అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్వదేశంలో జరిగే వరల్డ్ కప్ లో చహల్ లెగ్ స్పిన్ నైపుణ్యం ఇండియన్ టీమ్ కు బాగా కలిసి వచ్చేదని పలువురు అభిప్రాయపడ్డారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా మ్యాచ్ విన్నర్ ను పక్కన పెట్టేశారని చహల్ ను ఎంపిక చేయకపోవడంపై స్పందించాడు. మరికొంత మంది శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ లకు చోటు దక్కకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.

Whats_app_banner