WPI inflation in September: మరింత తగ్గిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం
India WPI inflation in september: దేశంలో డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ మరింత దిగొచ్చింది. సెప్టెంబర్లో 10.7శాతంగా నమోదైంది.
India WPI inflation : దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం.. సెప్టెంబర్లో దిగొచ్చింది. డబ్ల్యూపీఐ(హోల్ ప్రైజ్ ఇండెక్స్).. సెప్టెంబర్లో 10.7శాతంగా నమోదైంది. ఆగస్టులో ఇది 12.41శాతంగా ఉంది. ప్రస్తుతానికి టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ.. 18 నెలలుగా రెండంకెల్లోనే ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది.
ఆహార ఉత్పత్తి విభాగంలో ద్రవ్యోల్బణం 176(ఆగస్టు) నుంచి సెప్టెంబర్లో 175.2కు దిగొచ్చింది. డబ్ల్యూపీఐ ఫుడ్ ఇండెక్స్ ఆధారిత రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆగస్టులో 9.93శాతంగా ఉండగా, సెప్టెంబర్లో 8.08శాతానికి దిగొచ్చింది. ఈ డేటాన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శుక్రవారం ప్రకటించింది.
India CPI data : సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం పెరుగుదలకు మినరల్ ఆయిల్స్, ఆహార ఉత్పత్తులు, క్రూడ్ పెట్రోలియం, నేచ్యురల్ గ్యాస్, కెమికల్స్ అండ్ కెమికల్ ప్రాడక్ట్స్, లోహాలు, విద్యుత్, టెక్స్టైల్ వంటి అంశాలు ప్రధాన కారణమని తెలుస్తున్నాయి.
సెప్టెంబర్లో ఇండియాలో ద్రవ్యోల్బణం 7.41శాతానికి చేరింది. ఆగస్టులో ఇది 7శాతంగా ఉండేది. ద్రవ్యోల్బణాన్ని 2-6శాతం మధ్యలో ఉంచాలన్న ఆర్బీఐ ప్రణాళికలు ఫలించడం లేదని దీని ద్వారా అర్థమవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య విధానాన్ని రూపొందించడానికి ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తుంది.
2021 సెప్టెంబర్లో సీపీఐ ఇన్ఫ్లేషన్ 4.35శాతంగా ఉండటం గమనార్హం.
గ్రామీణ భారతంలో ధరల పెరుగుల తీవ్రత కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 7.56శాతంగా ఉండగా.. పట్టణాల్లో 7.27శాతంగా నమోదైంది.
సంబంధిత కథనం