Ultraviolette F77 launched: 307 కిలోమీటర్ల వరకు రేంజ్‍తో అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే!-ultraviolette f77 electric bike launched in india with sport look ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ultraviolette F77 Launched: 307 కిలోమీటర్ల వరకు రేంజ్‍తో అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే!

Ultraviolette F77 launched: 307 కిలోమీటర్ల వరకు రేంజ్‍తో అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 24, 2022 03:38 PM IST

Ultraviolette F77 electric bike launched: అల్ట్రావయ్‍లెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్ ఇండియాలో లాంచ్ అయింది. స్పోర్టీ లుక్, అదిరిపోయే రేంజ్, మంచి ఫీచర్లతో అడుగుపెట్టింది. మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.

Ultraviolette F77 launched: 307 కిలోమీటర్ల వరకు రేంజ్‍ అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్
Ultraviolette F77 launched: 307 కిలోమీటర్ల వరకు రేంజ్‍ అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్ (HT_Photo)

Ultraviolette F77 electric bike launched: స్పోర్టీ లుక్‍తో ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారి కోసం అదిరిపోయే మోడల్ వచ్చేసింది. బెంగళూరు కంపెనీ అల్ట్రావయ్‍లెట్ ఆటోమోటివ్ (Ultraviolette Automotive) నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇండియాలో లాంచ్ అయింది. అల్ట్రావయ్‍లెట్ ఎఫ్77 (Ultraviolette F77) పేరుతో ఈ స్టైలిష్ స్పోర్టీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అడుగుపెట్టింది. ముఖ్యంగా ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే 307 కిలోమీటర్ల వరకు ఈ బైక్‍పై ప్రయాణించవచ్చు. ఈ రేంజ్ దీనికి ప్రధాన ఆకర్షణగా ఉంది. ఇక డిజైన్ పరంగానూ స్పోర్ట్స్ బైక్‍‍లా స్టైలిష్‍గా కనిపిస్తుంది. ఎఫ్77 (Ultraviolette F77), ఎఫ్77 రెకాన్ (Ultraviolette F77 Recon) వేరియంట్లలో ఈ అల్ట్రావయ్‍లెట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది. లిమిడెట్ ఎడిషన్ కూడా అందుబాటులోకి వస్తుంది. Ultraviolette F77 ఎలక్ట్రిక్ బైక్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

జెట్ ఫైటర్స్ డిజైన్‍లా..

Ultraviolette F77 Electric Bike Design: స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్, అల్యూమినియమ్ బల్క్ హెడ్‍ను అల్ట్రావయ్‍లెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్ కలిగి ఉంది. షార్ప్ స్టైలింగ్ కోసం జెట్ ఫైటర్స్ డిజైన్‍ను ఆ సంస్థ స్ఫూర్తిగా తీసుకొని ఎఫ్77ను రూపొందించింది. అలాగే పరిచయం చేసినప్పటి కంటే హ్యాండిల్ బార్ హైట్‍ను పెంచిన అల్టావయ్‍లెట్, సీట్ హైట్‍ను తగ్గించింది. దీంతో మరింత అనుకూలంగా ఉండనుంది. ఎఫ్77పై ఏ బోల్టులు కనిపించవు. క్లీన్ డిజైన్‍తో స్పోర్టీ లుక్‍ను కలిగి ఉంది.

147 kmph టాప్ స్పీడ్

Ultraviolette F77 Electric Bike: పీఎంఎస్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ తో అల్ట్రావయ్‍లెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్ వస్తోంది. ఎఫ్77 బేస్ వేరియంట్ 36.2 hp పవర్ ను, 85 Nm టార్క్యూను జనరేట్ చేస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 142 కిలోమీటర్లుగా ఉంది. Ultraviolette F77 Recon వేరియంట్ 38.9 hp, 95 Nm టార్క్యూను ఉత్పత్తి చేయగలదు. దీని టాప్ స్పీడ్ 147 kmphగా ఉంది. రెండు మోడళ్లు ఫిక్స్డ్ బ్యాటరీ ఆప్షన్‍లతో వస్తున్నాయి. బేస్ మోడల్‍ 7.1 kWh బ్యాటరీతో వస్తుండగా.. 206 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఎఫ్77 రెకోన్ మోడల్‍లో 10.3 kWh సామర్థ్యమున్న బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ మోడల్ 307 కిలోమీటర్ల వరకు రేంజ్‍ను ఇస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న ‘టూవీలర్లతో పోలిస్తే ఇదే అత్యధిక బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

అల్ట్రావయ్‍లెట్ ఎఫ్77 స్పెషల్ ఎడిషన్ వేరియంట్ 40.2 హెచ్‌పీ పవర్, 100 Nm పీక్ టార్క్యూను జనరేట్ చేసే మోటార్ తో వస్తోంది. టాప్ స్పీడ్ 152 kmphగా ఉంటుంది. 307 కిలోమీటర్ల రేంజ్‍ను ఇస్తుంది. ఈ బ్యాటరీలు ఫుల్ చార్జ్ అయ్యేందుకు 7 నుంచి 8 గంటలు పడుతుంది. గ్లైడ్, కాంబాట్, బలాస్టిక్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.

మరెన్నో ఫీచర్లు..

Ultraviolette F77 Electric Bike వేరియంట్లన్నీ యూఎస్‍డీ ఫ్రంట్ ఫోర్క్స్, అడ్జస్టబుల్ మోనోషాక్‍తో వస్తున్నాయి. ముందు 320 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, వెనుక 230 mm డిస్క్ బ్రేక్ ఉంటాయి. బాష్‍కు చెందిన డ్యుయల్ ABS స్టాండర్డ్ గా ఉంటుంది. 5 టీఎఫ్‍టీ స్క్రీన్ ఈ బైక్‍కు ఉంటుంది. జియో ఫెన్సింగ్, లొకేటర్, లాక్‍డౌన్, రైడ్ అనలటిక్స్, క్రాష్ డిటెక్షన్‍తో పాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అల్ట్రావయ్‍లెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్‍కు స్మార్ట్ ఫోన్‍ను కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో మరిన్ని ఫీచర్లు వాడుకోవచ్చు.

Ultraviolette F77 Electric Bike: ధరలు

అల్ట్రావయ్‍లెట్ ఎఫ్77 బేస్ వేరియంట్ ధర రూ.3.8లక్షలుగా ఉంది. ఎఫ్77 రెకోన్ ధర రూ.4.55 లక్షలు. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. స్పెషల్ ఎడిషన్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఎయిర్ స్ట్రయిక్, షాడో, లేజర్ ఫినిష్‍ల్లో ఈ బైక్ లభిస్తుంది. వచ్చే సంవత్సరం ఈ Ultraviolette F77 Electric Bike అమ్మకానికి రానున్నాయి.

WhatsApp channel