Trading guide for today: ఈ రోజు ఈ స్టాక్స్ పై మంచి రిటర్న్స్ కు అవకాశం..-trading guide for today six buy or sell stocks for thursday june 15 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Trading Guide For Today: ఈ రోజు ఈ స్టాక్స్ పై మంచి రిటర్న్స్ కు అవకాశం..

Trading guide for today: ఈ రోజు ఈ స్టాక్స్ పై మంచి రిటర్న్స్ కు అవకాశం..

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 06:43 PM IST

మార్కెట్ నిపుణుల సలహాల ప్రకారం ఈ రోజు, జూన్ 15న రిలయన్స్, టాటా కెమికల్స్, ఓఎన్జీసీ, పేటీఎం, ఏయూబ్యాంక్, కొటక్ మహింద్ర బ్యాంక్ ల షేర్లు మంచి లాభాలను అందించే అవకాశం ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

మార్కెట్ నిపుణుల సలహాల ప్రకారం ఈ రోజు, జూన్ 15న రిలయన్స్, టాటా కెమికల్స్, ఓఎన్జీసీ, పేటీఎం, ఏయూబ్యాంక్, కొటక్ మహింద్ర బ్యాంక్ ల షేర్లు మంచి లాభాలను అందించే అవకాశం ఉంది.

Nifty, Sensex: నిఫ్టీ, సెన్సెక్స్

అంతర్జాతీయ సానుకూల పరిణామాల నేపథ్యంలో వరుసగా మూడో రోజు బుధవారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 39 పాయింట్లు లాభపడి, 18,755 పాయింట్ల వద్దకు చేరింది. బీఎస్ఈ సెన్సెక్స్ 85 పాయింట్లు లాభపడి, 63,228 పాయింట్ల వద్దకు చేరింది. బ్యాంక్ నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి,43,988 పాయింట్లకు చేరింది.

Day trading guide for today: ఈ రోజు వీటిని గమనించండి

ఈ రోజు నిఫ్టీ 18778 పాయింట్ల కన్నా పై స్థాయికి చేరే అవకాశముందని చార్ట్ ప్యాటర్న్ ల ఆధారంగా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 18,625 వద్ద స్ట్రాంగ్ సపోర్ట్ లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే, ఈ రోజు టీసీఎస్, విశాఖ ఇండస్ట్రీస్, డీసీబీ బ్యాంక్, డీజే మీడియా ప్రింట్ సంస్థల ఎక్స్ డివిడెండ్ డే కనుక ఆ స్టాక్స్ ఫోకస్ ఉండే అవకాశముంది. స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ సుమీత్ బగాడియా, అనూజ్ గుప్తా ల అంచనా ప్రకారం ఈ కింద పేర్కొన్న స్టాక్స్ పై ఈ రోజు పెట్టుబడి పెట్టడం మంచిది. అవి..

  • రిలయన్స్ : ప్రస్తుత ధర రూ. 2520.85, టార్గెట్ ధర రూ. 2620, స్టాప్ లాస్ రూ. 2470.
  • టాటా కెమికల్స్ : ప్రస్తుత ధర రూ. 1000, టార్గెట్ ధర రూ. 1042, స్టాప్ లాస్ రూ. 975.
  • ఓఎన్జీసీ: ప్రస్తుత ధర రూ. 156, టార్గెట్ ధర రూ. 175, స్టాప్ లాస్ రూ. 144.
  • పేటీఎం: ప్రస్తుత ధర రూ. 867, టార్గెట్ ధర రూ. 900, స్టాప్ లాస్ రూ.820.

Whats_app_banner