Electric Bikes : అందుబాటు ధరలోని ఈ ఎలక్ట్రిక్ బైక్‌లు డైలీ వాడకానికి బెటర్.. మంచి రేంజ్
Electric Bikes : ఇటీవల ఎలక్ట్రిక్ బైకుల వాడకం పెరిగింది. చాలా మంది వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్రోల్ ధరల భారంతోనూ అనేక మంది ఈవీలవైపు మెుగ్గు చూపుతున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ కొనాలి అనుకుంటే మీ కోసం లిస్టు ఉంది.. చూడండి..
భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో వివిధ రకాల స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇవి రోజువారీ ఉపయోగం కోసం తప్పనిసరి అయిపోయాయి. ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఇంధనం ఖర్చు లేని ఎలక్ట్రిక్ స్కూటర్లు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం, Revolt RV1, Oben Rorr, Ola రోడ్‌స్టర్ X మోటార్‌సైకిళ్లు దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చాలా సరసమైన ధరలో వస్తాయి. ఈ బైకుల ధరల గురించి ఇక్కడ వివరాలు తెలుసుకోండి..
రివోల్ట్ ఆర్వీ1
కొన్ని రోజుల క్రితం విడుదలైన రివోల్ట్ ఆర్వీ1 ఎలక్ట్రిక్ బైక్ గురించి చూద్దాం. ఇది ఆర్వీ1, ఆర్వీ ప్లస్ అనే 2 వేరియంట్‌ల ఎంపికలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 84,990 నుండి రూ.99,990 వరకు ఎక్స్-షోరూమ్ ధరగా నిర్ణయించారు. రివోల్ట్ ఆర్వీ1 వేరియంట్ 2.2 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికను కలిగి ఉంది. పూర్తి ఛార్జింగ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. రివోల్ట్ RV1 ప్లస్ వేరియంట్ 3.24 kWh బ్యాటరీని కలిగి ఉంది. ఫుల్ ఛార్జింగ్‌తో 160 కిలోమీటర్లు నడుస్తుంది. ఇది 6 అంగుళాల డిజిటల్ LCD డిస్‌ప్లేతో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇది 2.5 kWh, 3.5 kWh, 4.5 kWh బ్యాటరీతో లభిస్తుంది. వరుసగా రూ.74,999, రూ.84,999, రూ.99,999 (ఎక్స్-షోరూమ్) వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ఫుల్ ఛార్జ్‌పై 200 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 124 కి.మీ. ఇది 4.3-అంగుళాల ఎల్‌సీడీ సెగ్మెంట్ డిస్‌ప్లే, ఓలా మ్యాప్ నావిగేషన్ (టర్న్-బై-టర్న్), క్రూయిజ్ కంట్రోల్, OTA అప్‌డేట్‌లు, మోటార్‌సైకిల్ డిజిటల్ కీ అన్‌లాక్ వంటి ఫీచర్లను పొందుతుంది.
ఒబెన్ రోర్
ఒబెన్ రోర్ కూడా ఒక ప్రసిద్ధ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్. ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). ఇది 4.4 kWh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. పూర్తి ఛార్జింగ్‌తో 187 కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. ఇది గరిష్టంగా 100 kmph వేగాన్ని కలిగి ఉంది. కేవలం 3 సెకన్లలో 0-40 వేగాన్ని అందుకుంటుంది. కొత్త ఓపెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వస్తుంది. పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా చాలా ఫీచర్లు ఉన్నాయి. ఇది ఎకో, సిటీ, హవోక్ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ఇది రైడర్ భద్రత కోసం డిస్క్ బ్రేక్‌ను పొందుతుంది.