Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- మీరు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..-stocks to buy today 30 august 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- మీరు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- మీరు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu
Aug 30, 2024 08:50 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఇందులో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today list : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లోగా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 349 పాయింట్లు పెరిగి 82,135 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 100 పాయింట్లు పెరిగి 25,152 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 9 పాయింట్లు పెరిగి 51,153 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ 50 కొత్త గరిష్టాల వద్ద రోజువారీ చార్టులో పొడవైన బుల్ క్యాండిల్​ ఏర్పడింది. ఇది మార్కెట్ 25,100 స్థాయిల వద్ద రెసిస్టెన్స్​ని నిర్ణయాత్మకంగా బ్రేక్​ చేయడానికి సిద్ధమవుతోందని సూచిస్తుంది.

"ఇది సానుకూల సంకేతం. నిఫ్టీ స్వల్పకాలిక అప్​ట్రెండ్ సానుకూలంగా కొనసాగుతోంది. తదుపరి స్థాయిలు 25,360 - 25,400 (1.382% ఫిబోనాచి పొడిగింపు)," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి చెప్పారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3259.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2690.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ఐఐలు ఈ ఆగస్టు నెలలో ఇప్పటివరకు రూ. 26686.65 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 51476.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. మార్కెట్​లు ఆల్​టైమ్​ హై వద్ద ఉన్నప్పటికీ ఈ నెల ఎఫ్​ఐఐలు నెగిటివ్​ సైడ్​లోనే ముగించనున్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.59శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ ఫ్లాట్​గా ముగిసింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్​ 0.23 శాతం పతనమైంది.

స్టాక్స్​ టు బై..

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్: రూ.415.8 వద్ద కొనండి. రూ.450 టార్గెట్, స్టాప్ లాస్ రూ.403.

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ : రూ.12,450కే కొనొచ్చు. రూ.13,000 టార్గెట్- రూ.12,100 వద్ద స్టాప్ లాస్.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్సీ): రూ.554 వద్ద కొనండి. టార్గెట్​ రూ.575. రూ.540 వద్ద స్టాప్ లాస్.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఎన్​ఆర్​ఎల్ : రూ.101.27 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.107, స్టాప్ లాస్ రూ.97.50

గీకే వైర్స్: రూ.120.74 వద్ద కొనండి, టార్గెట్ రూ.127, స్టాప్ లాస్ రూ.116

సైబర్​టెక్​: రూ.229.57 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.240, స్టాప్ లాస్ రూ.220

గోకుల్ ఆగ్రో: రూ.263.35 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.279, స్టాప్ లాస్ రూ.253

పోకర్ణ: రూ .950.85 వద్ద కొనండి, టార్గెట్ రూ .1000, స్టాప్ లాస్ రూ .913

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం