ఈ చిన్న స్టాక్ ఒక్క రోజే 10 శాతం పెరిగింది.. బడ్జెట్‌లో రొయ్యల పెంపకంపై ప్రకటనే కారణం-stock market small cap stock zeal aqua share rallied more than 30 percent in 5 days double income in 6 months ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ చిన్న స్టాక్ ఒక్క రోజే 10 శాతం పెరిగింది.. బడ్జెట్‌లో రొయ్యల పెంపకంపై ప్రకటనే కారణం

ఈ చిన్న స్టాక్ ఒక్క రోజే 10 శాతం పెరిగింది.. బడ్జెట్‌లో రొయ్యల పెంపకంపై ప్రకటనే కారణం

Anand Sai HT Telugu
Jul 25, 2024 12:45 PM IST

Stock Market : బడ్జెట్‌లో రొయ్యల పెంపకంపై ప్రకటన తర్వాత జీల్ ఆక్వా షేర్లు భారీగా పెరిగాయి. 5 రోజుల్లో 30 శాతానికి పైగా షేర్లు వెళ్లాయి.

జీల్ ఆక్వా షేర్
జీల్ ఆక్వా షేర్

బడ్జెట్‌లో వచ్చిన బిగ్ గిఫ్ట్ తర్వాత స్మాల్‌క్యాప్ కంపెనీ జీల్ ఆక్వా షేర్లు భారీగా పెరిగాయి. గురువారం ఈ కంపెనీ షేరు ధర 10 శాతం పెరిగి రూ.16.88 వద్ద ముగిసింది. కంపెనీ షేర్లు 52 వారాల కొత్త గరిష్టానికి చేరుకున్నాయి. 5 రోజుల్లో ఆక్వా షేర్లు 30 శాతానికి పైగా పెరిగాయి. రొయ్యల వ్యాపారంతో సంబంధం ఉన్న ఈ కంపెనీ షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ.6.56గా ఉంది.

5 రోజుల్లో జీల్ ఆక్వా షేర్లు 30 శాతానికి పైగా పెరిగాయి. 2024 జూలై 19న కంపెనీ షేరు ధర రూ.12.70 వద్ద ఉంది. జూలై 25, 2024 నాటికి ఆక్వా షేరు ధర రూ.16.88కి చేరింది. అదే సమయంలో గత నెల రోజుల్లో కంపెనీ షేర్లు 45 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు కంపెనీ షేర్లు 100 శాతానికి పైగా పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్ల సొమ్మును రెట్టింపు చేశాయి. ఈ ఏడాది జనవరి 1, 2024న జీల్ ఆక్వా షేరు ధర రూ.8.20గా ఉంది. 2024 జూలై 25 నాటికి కంపెనీ షేరు ధర రూ.16.88కి చేరింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2024 ప్రసంగంలో రొయ్యల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. అంతేకాకుండా రొయ్యల పెంపకం కోసం పెద్ద ఎత్తున ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కూడా ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.

రొయ్యల పెంపకం, ప్రాసెసింగ్, ఎగుమతులకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో సీఫోర్డ్ ఎగుమతులు రూ.60,500 కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గమనిక : ఇది స్టాక్ పనితీరు గురించి మాత్రమే, పెట్టుబడి సలహా గురించి కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌కు లోబడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner