SBI to hike base rate, BPLR: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI) తమ వద్ద రుణం తీసుకున్న కస్టమర్లకు షాకింగ్ న్యూస్ వెల్లడించింది. మార్చి 15, బుధవారం నుంచి బేస్ రేట్ (base rate), బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR) లను పెంచుతున్నట్లు ప్రకటించింది.
బేస్ రేట్ (base rate), బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR) లను పెంచుతున్నట్లు ఎస్బీఐ (SBI) వెబ్ సైట్ లో పేర్కొంది. సాధారణంగా ఎస్బీఐ ప్రతీ మూడు నెలలకు ఒక సారి ఈ బేస్ రేట్ (base rate), బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR) లను సమీక్షిస్తుంటుంది. తాజాగా బీపీఎల్ఆర్ (BPLR) ను 70 బేసిస్ పాయింట్లు లేదా 0.7 శాతం పెంచుతున్నట్లు ఎస్బీఐ (SBI) ప్రకటించింది. తాజా పెంపుతో ఎస్పీఐ బీపీఎల్ఆర్ (BPLR) 14.15% నుంచి 14.85 శాతానికి చేరింది. ఈ నిర్ణయంతో బీపీఎల్ఆర్ (BPLR) తో లింక్ అయి ఉన్న రుణాల ఈఎంఐ, తద్వరా రీపేమెంట్ భారం మరింత పెరగనుంది. గత సంవత్సరం డిసెంబర్ లో చివరగా బీపీఎల్ఆర్ ను ఎస్పీఐ (SBI) సమీక్షించింది.
అలాగే, బేస్ రేట్ (base rate) ను కూడా ఎస్పీఐ పెంచింది. బేస్ రేట్ ను 70 బేసిస్ పాయింట్లు లేదా 0.7% పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపుతో ప్రస్తుతం 9.4% ఉన్న బేస్ రేట్ 10.10 శాతానికి చేరుతుంది. బేస్ రేట్ (base rate) పెంపు కూడా మార్చి 15 నుంచి అమల్లోకి వస్తుంది. గత సంవత్సరం డిసెంబర్ లో చివరగా బేస్ రేట్ (base rate) ను ఎస్పీఐ (SBI) సమీక్షించింది. ఈ బేస్ రేట్ పెంపు వల్ల బేస్ రేట్ పై లోన్స్ తీసుకున్నవారికి ఈఎంఐ (EMI) భారం పెరుగుతుంది.
సాధారణంగా గతంలో బీపీఎల్ఆర్ (BPLR), బేస్ రేట్ (base rate) ల ఆధారంగా బ్యాంకులు ఎక్కువగా రుణాలను ఇస్తుండేవి. కానీ ఇటీవల బ్యాంకులు ఎక్కువగా ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (EBLR) ఆధారంగా కానీ, రెపొ లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR) ఆధారంగా కానీ లోన్ లను ఇస్తున్నాయి. ఏప్రిల్ 6వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధానాన్ని (monetary policy) సమీక్షించనుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేేసే లక్ష్యంతో మరోసారి వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కీలక రేట్లను కనీసం 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.