Samsung Galaxy A06: శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ లో మరో చవకైన స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఇతర వివరాలు..-samsung galaxy a06 launched in india check pricing availability and features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy A06: శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ లో మరో చవకైన స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఇతర వివరాలు..

Samsung Galaxy A06: శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ లో మరో చవకైన స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఇతర వివరాలు..

Sudarshan V HT Telugu
Sep 04, 2024 05:24 PM IST

Samsung Galaxy A06 launch: శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ లో మరో స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. గెలాక్సీ ఏ06 స్మార్ట్ ఫోన్ ను రూ.9,999 కే శాంసంగ్ లాంచ్ చేసింది. ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూడండి.

శాంసంగ్ గెలాక్సీ ఏ 06 స్మార్ట్ ఫోన్ లాంచ్
శాంసంగ్ గెలాక్సీ ఏ 06 స్మార్ట్ ఫోన్ లాంచ్ (Samsung)

Samsung Galaxy A06 launch: శాంసంగ్ గెలాక్సీ ఏ 06 స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ తన మునుపటి గెలాక్సీ ఎ 05 మోడల్ లోని అనేక ఫీచర్లను యథాతథంగా కలిగి ఉంది. అయితే, శాంసంగ్ గెలాక్సీ ఏ05 మోడల్ కంటే తక్కువ ధరకే ఈ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఏ06 వస్తుంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్సీడీ యూ-కట్ డిస్ప్లే ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎ06 రాబోయే రోజుల్లో వివిధ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ లు, రిటైల్ అవుట్ లెట్ లలో అమ్మకానికి రానుంది.

భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎ06 ధర

శాంసంగ్ గెలాక్సీ ఎ06 రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. లైట్ బ్లూ, బ్లాక్, గోల్డ్ కలర్ వేరియంట్లలో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎ06 స్పెసిఫికేషన్లు

కొత్తగా లాంచ్ చేసిన శాంసంగ్ (SAMSUNG) గెలాక్సీ ఎ06 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ హెచ్ డీ+ డిస్ ప్లేతో పాటు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 1600 X 720 పిక్సల్ రిజల్యూషన్ తో పాటు ముందు భాగంలో వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తుంది. మీడియాటెక్ హీలియో జీ85 ఎస్ వోసీ చిప్ సెట్ తో పాటు మాలి-జీ52 ఎంపీ2 జీపీయూ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉంది. కెమెరాసెటప్ లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు ఎఫ్/2.4 ఎపర్చర్ తో 2 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఇందులో ఉంది. సెల్ఫీలు దిగేందుకు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ పవర్

శాంసంగ్ గెలాక్సీ ఏ06 స్మార్ట్ ఫోన్ లో 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. 4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఏసీ, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను ఇది సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్టుకు అనుకూలంగా ఉంటుంది. శాంసంగ్ నాక్స్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్ లాక్ వంటి అదనపు ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి. చివరగా, గెలాక్సీ ఎ06 స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యుఐ 6.1 పై పనిచేస్తుంది. ఇది మూడు సంవత్సరాల వరకు రెండు ప్రధాన OS అప్ డేట్ లు, సెక్యూరిటీ ప్యాచ్ అప్ డేట్ లను అందిస్తుంది.

Whats_app_banner