Primebook 4G Laptop: రూ.20వేలలోపు ధరతో ప్రైమ్‍బుక్ ఆండ్రాయిడ్ ల్యాప్‍టాప్ లాంచ్.. ఎలా ఉందంటే..!
Primebook 4G Laptop: ప్రైమ్‍బుక్ 4జీ ఆండ్రాయిడ్ ల్యాప్‍టాప్ లాంచ్ అయింది. బడ్జెట్ ధరలో ఇది ఎంటర్ అయింది. 4జీ సిమ్‍కు సపోర్ట్ చేస్తుంది.
Primebook 4G Laptop: ప్రైమ్‍బుక్ 4జీ ల్యాప్‍టాప్ భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. ఆన్‍లైన్ క్లాసులు, ఈ-లెర్నింగ్ కోసం ఉపయోగపడేలా ఇది ఉంది. ఇటీవల షార్క్ ట్యాంక్ సీజన్-2 నుంచి నిధులను సమీకరించిన ప్రైమ్‍బుక్ కంపెనీ ఈ ల్యాప్‍టాప్‍ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‍పై ఈ ప్రైమ్‍బుక్ రన్ అవుతుంది. విండోస్ అప్లికేషన్లు సపోర్ట్ చేయవు. ల్యాప్‍టాప్ రూపంలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ అని దీన్ని చెప్పవచ్చు. 10వేలకు పైగా ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ చేస్తాయి. ఈ-లెర్నింగ్ కోసం ప్రత్యేక యాప్స్ ఉంటాయి. ప్రైమ్‍బుక్ 4జీ ల్యాప్‍టాప్ పూర్తి వివరాలు ఇవే.
ప్రైమ్‍బుక్ 4జీ ల్యాప్‍టాప్ స్పెసిఫికేషన్లు
Primebook 4G Specifications: హెచ్‍డీ రెజల్యూషన్ ఉండే 11.6 ఇంచుల ఐపీఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేను ప్రైమ్‍బుక్ 4జీ ల్యాప్‍టాప్ కలిగి ఉంది. ఈ ల్యాప్‍టాప్ మొత్తంగా 1.2 కేజీల బరువు ఉంటుంది. మీడియాటెక్ కంపానియో 500 (MediaTek Kompanio 500) ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 4జీబీ ర్యామ్, గరిష్ఠంగా 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్‍డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 200జీబీ వరకు పొడిగించుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 11 బేస్డ్ ప్రైమ్ ఓఎస్‍పై ఈ Primebook 4G Laptop రన్ అవుతుంది. ప్రైమ్ స్టోర్ ద్వారా 10వేలకు పైగా ఆండ్రాయిడ్ యాప్స్ అందుబాటులో ఉంటాయని ప్రైమ్‍బుక్ కంపెనీ చెబుతోంది. వందలాది ఎడ్యుకేషనల్, ఈ-లెగ్నింగ్ యాప్స్ ఉంటాయని పేర్కొంది.
Primebook 4G Laptop: 4జీ సిమ్ సపోర్ట్, వైఫై, బ్లూటూత్, రెండు యూఎస్‍బీ పోర్టులు, 3.5mm హెడ్‍ఫోన్ జాక్, మినీ హెచ్‍డీఎంఐ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లను ఈ ప్రైమ్‍బుక్ 4జీ ల్యాప్‍టాప్ కలిగి ఉంది. 4,000mAh బ్యాటరీ ఈ ల్యాప్‍టాప్‍లో ఉంది. ఇక వీడియో కాల్స్ కోసం 2 మెగాపిక్సెల్ వెబ్‍క్యామ్ ఉంటుంది. టచ్ ప్యాడ్, పెరెంటల్ కంట్రోల్స్ ఫీచర్ ఉంటాయి.
ప్రైమ్‍బుక్ 4జీ ధర, సేల్
Primebook 4G Laptop Price: 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఉండే ప్రైమ్‍బుక్ 4జీ ల్యాప్‍టాప్ బేస్ వేరియంట్ ధర రూ.16,990గా ఉంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.18,990గా ఉంది. ఈనెల 11వ తేదీన ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ ల్యాప్‍టాప్ సేల్‍కు వస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్‍తో తొలి సేల్‍లో ఈ ల్యాప్‍టాప్‍ను కొంటే రూ.2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్‍కార్ట్ పేర్కొంది.
ఈ ల్యాప్‍టాప్.. ఆన్‍లైన్ క్లాసులు, ఈ-లెర్నింగ్ కోసం ఎక్కువగా ఉపయోగపడుతుంది. భారీ యాప్స్, గేమింగ్‍కు సూటవదు. ల్యాప్‍టాప్ రూపంలో ఉన్న బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‍గా దీన్ని భావించవచ్చు.