TSSPDCL bill payment : డిస్కమ్​ యాప్​లో మీ విద్యుత్​ బిల్లులను ఇలా కట్టండి..-how to pay electricity bill in tsspdcl app see stepwise process here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tsspdcl Bill Payment : డిస్కమ్​ యాప్​లో మీ విద్యుత్​ బిల్లులను ఇలా కట్టండి..

TSSPDCL bill payment : డిస్కమ్​ యాప్​లో మీ విద్యుత్​ బిల్లులను ఇలా కట్టండి..

Sharath Chitturi HT Telugu
Jul 06, 2024 06:43 AM IST

How to pay electricity bill in Telangana : కొత్త రూల్స్​ ప్రకారం ఇప్పుడు తెలంగాణ ప్రజలు డిస్కమ్​ యాప్స్​ ద్వారా విద్యుత్​ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్​ని ఇక్కడ తెలుసుకోండి..

మీ విద్యుత్​ బిల్లులను ఇలా కట్టండి..
మీ విద్యుత్​ బిల్లులను ఇలా కట్టండి..

ఫోన్​పే, గూగుల్​ పే, పేటీఎంలను వాడి విద్యుత్​ బిల్లులను చెల్లించకూడదని చెప్పి తెలంగాణ ప్రజలకు షాక్​ ఇచ్చారు అధికారు. ఆర్​బీఐ సూచనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. అయితే, ఇంతకాలం థర్డ్​ పార్టీ యాప్స్​ ద్వారా చాలా మంది సులభంగా వారి విద్యుత్​ బిల్లలను చెల్లించేవారు. పైగా వారికి అలర్ట్స్​ కూడా వచ్చేవి. కానీ ఇప్పుడు ఆయా యాప్స్​లో విద్యుత్​ బిల్లులు కట్టడానికి వీలులేదు. విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన యాప్‌లో సర్వీస్‌ నంబర్‌తో నమోదు చేసుకుని అక్కడి నుంచి చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఇది జులై 1 నుంచే అమల్లోకి వచ్చింది. అయితే చాలా మందికి బిల్లులను ఎలా కట్టాలో తెలియడం లేదు. తెలంగాణలో విద్యుత్​ బిల్లులు ఆన్​లైన్​, డిస్కం మొబైల్​ యాప్​ ద్వారా ఎలా కట్టాలో ఇక్కడ తెలుసుకోండి..

ముందు అకౌంట్​ క్రియేట్​ చేసుకోవాలి..

స్టెప్​ 1 :- TSSPDCL మొబైల్​ యాప్​ డౌన్​లోడ్​ చేసుకోండి.

స్టెప్​ 2 :- సర్వీస్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది.

స్టెప్​ 3 :- మీ యునీక్​ సర్వీస్​ కోడ్ నెంబర్​ని ఎంటర్​ చేయండి. (అది ఎలక్ట్రిసిటీ బిల్లుపై ఉంటుంది).​ మొబైల్​ నెంబర్​ని ఎంటర్​ చేయండి.

స్టెప్​ 4 :- ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్​ చేయండి. ఆ తర్వాత రిజిస్టర్​ బటన్​ మీద క్లిక్​ చేయండి.

రిజిస్ట్రేషన్​ పూర్తైన తర్వాత యాప్​లో బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ వివరాలు..

స్టెప్​ 1 :- యాప్​లో కనిపించే పే బిల్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 2 :- మీ పేరు, యూఎస్​ఎన్​, అడ్రెస్​ వివరాలతో ఒక ఆప్షన్​ కనిపిస్తుంది. దాని మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3 :- మీ పూర్తి వివరాలు అక్కడ కనిపిస్తాయి. ఏ నెలకు సంబంధించిన బిల్లు కడుతున్నారు? బిల్లు ఎంత ఉంది? డ్యూ డేట్​ ఏంటి? వంటి వివరాలు కనిపిస్తాయి. వాటిని చెక్​ చేసుకోండి.

స్టెప్​ 4 :- మీ ఈ-మెయిల్​ ఐడీ ఎంటర్​ చేయాల్సి ఉంటింది. ఆ తర్వాత ప్రొసీడ్​ టు పే బటన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 5 :- పే విత్​ టీ-వాలెట్​, బిల్​డెస్క్​ పేమెంట్, పేటీఎం అని ఆప్షన్స్​ కనిపిస్తాయి. ఒకటి ఎంచుకోండి.

స్టెప్​ 6 :-​ బిల్​డెస్క్​ పేమెంట్​ ఎంచుకుంటే క్రెడిట్​/ డెబిట్​, ఇంటర్నెట్​ బ్యాంకింగ్​, వాలెట్​, క్యూఆర్​, యూపీఐ వంటి ఆప్షన్స్​ వస్తాయి.

స్టెప్​ 7:- యూపీఐ ఆప్షన్​ ఎంచుకుని మీ యూపీఐ ఐడీని ఎంటర్​ చేయండి. మీ యూపీఐకి అగ్రిగేటర్​ మెసేజ్​ వస్తుంది. మీరు బిల్లు కట్టేయొచ్చు.

స్టెప్​ 8 :- యూపీఐ ద్వారా విద్యుత్​ బిల్లు చెల్లించిన అనంతరం డిస్కం యాప్​లోకి వస్తే, పేమెంట్​ పూర్తైనట్టు నోటిఫికేషన్​ వస్తుంది.

స్టెప్​ 9 :- బిల్​ రిసిప్ట్​ని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఆ తర్వాత డన్​ బటన్​ కొట్టి యాప్​ని క్లోజ్​ చేయొచ్చు.

విద్యుత్​ బిల్లుల విషయంలో ప్రజల సౌకర్యం కోసం కీలక చర్యలు తీసుకోవాలని TSSPDCL భావిస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లులపైనే ఒక క్యూఆర్​ కోడ్​ని ముద్రించాలని చూస్తోంది. దానిని మొబైల్​ ఫోన్​లో స్కాన్​ చేస్తే, డైరెక్ట్​ పేమెంట్​ ఆప్షన్​ వస్తుందని సమచారం. ఇది వచ్చే నెల నుంచి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం