UPI payments in UAE: దుబాయి వెళ్తున్నారా?.. యూఏఈలోనూ ఇక యూపీఐ ద్వారా చెల్లింపులు జరపవచ్చు!
UPI payments in UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లే భారతీయ పర్యాటకులు, అక్కడి ఎన్ఆర్ఐ లకు శుభవార్త. వారు ఇకపై యూఏఈలో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. దీనివల్ల భారతీయ పర్యాటకులు, ప్రవాస భారతీయులకు సులువైన, సురక్షితమైన లావాదేవీలు సాధ్యమవుతాయి.
UPI payments in UAE: యూఏఈ సహా మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాల్లో ఇకపై యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ లేదా యూపీఐ ద్వారా ఇకపై చెల్లింపులు జరపవచ్చు. ఇది ఆయా దేశాలకు వెళ్లే, ముఖ్యంగా దుబాయి, అబుదాబీ లకు వెళ్లే భారతీయ పర్యాటకులకు, అక్కడి ఎన్ఆర్ఐలకు సులువైన, సురక్షితమైన పేమెంట్ అవకాశాలను కల్పిస్తుంది.
నెట్ వర్క్ తో ఒప్పందం
మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా (MEA) ప్రాంతంలో డిజిటల్ వాణిజ్యానికి సంబంధించిన ప్రముఖ సంస్థ నెట్ వర్క్ ఇంటర్నేషనల్ (NETWORK) తో భారత్ కు చెందిన ఎన్పీసీఐ (NPCI) ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా యుఎఇలోని పాయింట్ ఆఫ్ సేల్ (POS) టెర్మినల్స్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపులు సాధ్యమవుతాయి.
క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో ఈజీ పేమెంట్స్
యూఏఈలోని నెట్ వర్క్ ఇంటర్నేషనల్ కు విస్తారమైన మర్చంట్ నెట్ వర్క్ ఉంది. దానిద్వారా భారతీయ పర్యాటకులు, ప్రవాస భారతీయులు (NRI) సులువైన, సురక్షితమైన లావాదేవీలు చేసుకోవచ్చని ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో తెలిపింది. రిటైల్, హాస్పిటాలిటీ, ట్రాన్స్ పోర్ట్, సూపర్ మార్కెట్లు సహా 60,000 మందికి పైగా వ్యాపారులకు నెట్ వర్క్ కు చెందిన 200,000 కు పైగా పీఓఎస్ టెర్మినల్స్ ఉన్నాయి. ఇక్కడ క్యూఆర్ కోడ్ (QR code) స్కానింగ్ తో ఈజీగా పేమెంట్స్ చేసేయొచ్చు.
మాల్స్, రిటైల్ స్టోర్స్ లో కూడా..
రిటైల్ స్టోర్లు, డైనింగ్ అవుట్ లెట్లతో పాటు దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ సహా వివిధ ప్రముఖ పర్యాటక, హాలీడే డెస్టినేషన్స్ లో పీఓఎస్ టెర్మినల్స్ (POS terminals) ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. భారతీయ పర్యాటకులు, భారతీయ బ్యాంకు ఖాతాలు ఉన్న ఎన్ఆర్ఐలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
టాపిక్