CNG Car Tips : మీకు సీఎన్జీ కారు ఉందా? అయితే తప్పుకుండా ఈ చిట్కాలు పాటించాలి-have you cng car then must follow these safety and key essential tips for maintain it ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cng Car Tips : మీకు సీఎన్జీ కారు ఉందా? అయితే తప్పుకుండా ఈ చిట్కాలు పాటించాలి

CNG Car Tips : మీకు సీఎన్జీ కారు ఉందా? అయితే తప్పుకుండా ఈ చిట్కాలు పాటించాలి

Anand Sai HT Telugu
Aug 06, 2024 03:30 PM IST

CNG Car Tips : భారతీయ మార్కెట్లో సీఎన్జీ కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అయితే సీఎన్జీ కారును కొంటే మాత్రమే సరిపోదు. దాని మెయింటెనెన్స్ కూడా సరిగా ఉండాలి. అప్పుడే ప్రమాదాలు జరగవు, మైలేజీ కూడా ఎక్కువగా ఇస్తాయి.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్జీ
హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్జీ (Hyundai Exter Hy CNG Duo)

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో సీఎన్జీ కార్లకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణహితం గురించి ఆలోచించేవారు వీటి వైపు మెుగ్గుచూపుతున్నారు. ఇది CNG ఆధారిత వాహనాల పెరుగుదలకు దారితీసింది. అయితే వీటి ధరలు ఎక్కువే ఉన్నప్పటికీ.. పెట్రోల్ లేదా డీజిల్ వాటికంటే వీటిని వాడటం ఉత్తమం అని చాలా మంది భావిస్తున్నారు. ఈ కార్లు వాడే వారు CNG ఆటో సేఫ్టీ, మెయింటెనెన్స్ గైడ్ గురించి తెలుసుకోవాలి. మీ CNG కారును ఎలా సర్వీస్ చేయాలో మీరు తెలుసుకోండి..

CNG కార్ల ధర ఎక్కువే. అయితే పెట్రోల్, డిజీల్ కార్లతో పోలీస్తే.. ఇందులో ఇబ్బందులు తక్కువే ఉంటాయి. దీనిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. CNG పెట్రోల్‌తో పోల్చినప్పుడు అత్యంత మండే వాయువు అని గుర్తుంచుకోవాలి. CNG సిలిండర్ లేదా ఫ్యూయల్ లైన్ నుండి ఒక చిన్న లీకేజీ కూడా తీవ్రమైన ప్రమాదాలకు దారి తీస్తుంది. భద్రత విషయానికి వస్తే CNG కార్ల నిర్వహణ చాలా ముఖ్యమైనది.

స్పార్క్ ప్లగ్ చెకింగ్

సీఎన్జీ కార్ స్పార్క్ ప్లగ్‌లు పెట్రోల్‌తో నడిచేవాటికి భిన్నంగా ఉంటాయి. సీఎన్జీతో నడుస్తున్న మీ వాహనంలో సరైన స్పార్క్ ప్లగ్‌ల అమరికను చెక్ చేసుకోవాలి. ఇవి వదులుగా ఉండకుండా చూసుకోవాలి. సీఎన్జీ స్పార్క్ ప్లగ్‌తో పోలీస్తే సాధారణ స్పార్క్ ప్లగ్‌లలో స్పార్క్ సోర్స్, ప్లగ ఎండ్ మెటాలిక్ టిప్ అంతరం త్కకువగా ఉంటుంది. మీరు ఉపయోగించే సీఎన్జీ స్పార్క్ ప్లగ్ 10 వేల కిటో మీటర్లు తిరిగిన తర్వాత మార్చుకోవడం మంచిది.

థొరెటల్ బాడీ శుభ్రం

థొరెటల్ వాల్వ్ మీ కారు ఎయిర్ ఫిల్టర్‌ను ఇన్‌టెక్‌కి కనెక్ట్ చేస్తుంది. సీఎన్జీ కారు మెయిటెనెన్స్ చిట్కాలను అనుసరిస్తూ.. మీ ఎయిర్ ఫిల్టర్‌ను శభ్రం చేయాలి. లేదా కొత్తవి వేసుకోవాలి. గాలి సరిగా వెళ్లేందుకు థొరెటల్ బాడీనీ సరిగ్గా శుభ్రం చేయాలి.

సీఎన్జీ రీడ్యూసర్ ఫిల్టర్

సీఎన్జీ రీడ్యూసర్ ఫిల్టర్ కార్ట్రిడ్జ్ మరియు సీఎన్జీ అల్ప పీడన ఫిల్టర్ కార్ట్రిడ్జ్ 0 రింగ్‌లతో కలిసి క్రమ వ్యవధిలో భర్తి అవుతాయి. ఉత్తమ పనితీరు కోసం ప్రతీ 40 వేల కిలో మీటర్లకు లో-ప్రెజర్ ఫిల్టర్ మార్చాలి. అలాగే ప్రతీ 20 వేల కిలో మీట్రకు తక్కువ పీడన ఫిల్టర్ కాట్రిడ్జ్‌ను ఛేంజ్ చేయాలి.

సీఎన్జీ ట్యాంక్ చెకింగ్

సీఎన్జీ కారు మెయింటెన్స్ కోసం మరో కీలకమైన చిట్కా ఏంటంటే.. సీఎన్జీ సిలిండర్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి. ఈరోజుల్లో సీఎన్జీ సిలిండర్ హైడ్రో టెస్టింగ్ తప్పనిసరి అయింది. దీనిని ఎప్పటికీ విస్మరించకూడదు. తక్కువ సీఎన్జీతో మీ కారును నిరంతరం నడపవద్దు. ఇది వాల్వ్‌లకు నష్టం కలిగిస్తుంది. కొన్నిసార్లు పేలుడు సంభవించవచ్చు.

కోడ్ స్కాన్ చేసి చూడండి

కొత్త సీఎన్జీ కంప్లయన్స్ ప్లేట్‌పై క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇది స్కాన్ చేయండి. సిలిండర్ అన్ని రికార్డులను మీకు చూపిస్తుంది. దీని ద్వారా మీ సిలిండర్ ప్రభుత్వం ధృవీకరించిన ఏజెన్సీ ద్వారా వచ్చిందని చూసుకోవచ్చు. గడువు ముగిసిన సీఎన్జీ వర్తింపు ప్లేట్ భారీ జరిమానాలు పడేలా చేస్తుంది.

టాపిక్